UA-35385725-1 UA-35385725-1

ఉత్సవం  ప్రీరిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి 

ఉత్సవం  ప్రీరిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి 

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో టీం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిధిగా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఉత్సవం సినిమా కాన్సెప్ట్ చెప్పినపుడే నాకు బాగా నచ్చింది. నాటకరంగం, రంగస్థలం బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ అర్జున్ సాయి చాలా బ్యూటీఫుల్ గా స్క్రిప్ట్ చేశారు. నాటకం గురించి ఈ జనరేషన్ కి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది. నాటకం నుంచి చాలా గొప్ప నటులు సినిమా రంగాన్ని ఏలారు. నాటకం అమ్మలాంటింది. సినిమా ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్న బిడ్డలాంటింది. ఈ సోషల్ మీడియా జనరేషన్ లో నాటకాలు ఇంకా ఉన్నాయా అనే అనుమానం రావచ్చు. నాటక ప్రదర్శనలు ఇంకా జరుగుతున్నాయి. నేను, రఘుబాబు అన్నయ్య చాలా నాటకపోటీలకు విశిష్ట అతిధులుగా వెళ్లి టీమ్స్ కి బ్లెస్ చేసి, బహుమతులు ఇస్తుంటాం. నాటకరంగం నుంచి ఇప్పటికీ చాలా మంది నటులు సినిమాలకి వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలా మందికి వేషాలు ఇచ్చాను. అలాంటి నాటకరంగాన్ని నేపధ్యంగా ఎంచుకొని ‘ఉత్సవం’ సినిమాని చాలా కష్టపడి చేశారు. మీ కష్టానికి తగిన ఫలితం రావాలి. దర్శక నిర్మాతలకు నా స్పెషల్ విషెస్. దిలీప్ కి ఇది ఫస్ట్ ఫిల్మ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. రెజీనా మంచి రోల్స్ చేస్తుంటారు. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అనూప్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. బ్రహ్మానందం గారి గ్లింప్స్ చూసి షాక్ అయ్యాను. ఆయన్ని ఇంకా మంచి మంచి పాత్రల్లో మనం ఉపయోగించుకోవాలి. రాజేంద్రప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటులు. ఉత్సవం పోస్టర్ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. ఇందులో వుండే దాదాపు అందరి నటులతో వర్క్ చేశాను. టీంలో అందరికీ నా బెస్ట్ విషెస్. ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుంటున్నాను’ అన్నారు
హీరోయిన్ రెజీనా కసాండ్రా మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మీ అందరినీ కలవడం ఉత్సవం లా వుంది. డైరెక్టర్ అర్జున్ సాయి గారు అంకితభావంతో ఈ సినిమా చేశారు. ఇలాంటి బ్యాప్ డ్రాప్ లో లవ్ స్టొరీని చెప్పడం మామూలు విషయం కాదు. అది నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో ఒక సోల్ వుంది. ఆ సోల్ నాటకాలు. సురబి నాటకాల వారికి అభినందనలు. డీవోపీ రసూల్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, టీం అందరికీ థాంక్ యూ. మా నిర్మాత సురేష్ పాటిల్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్ యూ. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడండి’ అన్నారు.
హీరో దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ.. ఉత్సవం నా ఫస్ట్ సినిమా. ఈ సినిమాని ప్రోత్సహించడానికి విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. సినిమా బావుంటే కొత్తవారిని దగ్గరకి తీసుకొని ప్రోత్సహించేది మన తెలుగు ఇండస్ట్రీ. మేము కూడా ఒక కొత్త ప్రయత్నంతో వస్తున్నాం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం గారు లాంటి గొప్ప నటులు పని చేశారు. ఈ సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ రెజీనా. థాంక్ యూ సో మచ్. డైరెక్టర్ అర్జున్ సాయితో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నాను. ఈ సినిమా ఇచ్చినందుకు థాంక్ యూ. నిర్మాత సురేష్‌ పాటిల్‌ గారు చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాని చూసి ఫస్ట్ అప్రిషియేషన్ ఇచ్చింది శశి గారు. మైత్రీ మూవీ మేకర్స్ కి, హోంబలే, సినీ పోలిస్ వారికి థాంక్ యూ. మనసుకి చాలా దగ్గరైనా సినిమా ఇది. సెప్టెంబర్ 13న మన తెలుగు సినిమా ఉత్సవం రిలీజ్ అవుతుంది. మీ అందరి సపోర్ట్, లవ్ కావాలి’ అన్నారు.
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. డైరెక్టర్ అర్జున్ సాయి పట్టువదలని విక్రమార్కుడు. ఎన్నో హార్డిల్స్ ని దాటుకొని చాలా మంది నటులతో ఈ సినిమాని తీశాడు. నాటకం గురించి తనకున్న తపన అద్భుతం. అందరి నటుల నుంచి కావాల్సిన నటన రాబట్టుకున్నాడు. నిర్మాత సురేష్ ఇలాంటి గొప్ప సినిమాలు మరెన్నో తీయాలి. ఈ సినిమా విజయోత్సవానికి మళ్ళీ మనమంతా కలుసుకోవాలి. సురభి నాటక మండలి వారికి ధన్యవాదాలు. నాటక రంగాన్ని బ్రతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో నటించాను. వారిపై ఒక సినిమా తీయాలనే ఆలోచన మామూలు విషయం కాదు. ఈ విషయంలో దర్శకుడిని అభినందిస్తున్నాను. తను మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను’ అన్నారు
దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ముందుగా సురభి వారికి కృతజ్ఞతలు. ఆర్ట్ కోసం జీవితాల్ని త్యాగం చేసిన దాదాపు 150 కుటుంబాలు వున్నాయి. వారి అంకిత భావం చూసి ఈ కథని రాయడం మొదలుపెట్టాను. దీనికి బ్యూటీఫుల్ లవ్ స్టొరీ యాడ్ చేశాం. హీరో, హీరోయిన్ పాత్రలు రాసినప్పుడు సాక్షాత్ శివ పార్వతులే దక్ష యజ్ఞం నాటకం వేయడానికి వచ్చారేమో అనిపించింది. కథనే ఇంత మందిని డ్రైవ్ చేసింది. ఉత్సవం చూసి బయటికి వచ్చినప్పుడు ప్రేక్షకుడి మొహంపై ఓ చిరునవ్వు వుంటుంది. నా డైరెక్షన్ టీంకి థాంక్ యూ. సెప్టెంబర్ 13న థియేటర్స్ లో సినిమా చూడండి. ఒక మంచి సినిమా చూసి ఫీలింగ్ కలుగుతుంది. అది మా గ్యారెంటీ’ అన్నారు.
నిర్మాత సురేష్‌ పాటిల్‌ మాట్లాడుతూ., అందరికీ నమస్కారం. చాలా మంచి సినిమా ఇది. చాలా గొప్ప నటులు ఈ సినిమాకి పని చేశారు. మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. సినిమా చూసినప్పుడు ఉత్సవంలా వుంటుంది. హీరో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. శశిగారికి థాంక్ యూ. తప్పకుండా సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉత్సవం సినిమా చూశాను. చాలా ఫీల్ గుడ్ ఫిలిం ఇది. ఈ మధ్యకాలంలో రంగమార్తాండ సినిమా చేశాం. అందులో వుండే ఫీల్ కి ఇది నెక్స్ట్ వెర్షన్. లవ్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. దిలీప్ చాలా అనుభవం వున్న నటుడిగా కనిపించారు. తనని బ్రైట్ ఫ్యూచర్ వుంటుంది. రెజీనా గారు అద్భుతంగా చేశారు. అనూప్ రూబెన్స్ చాలా బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సురేష్ గారికి థాంక్ యూ. ఫ్యామిలీ అంతా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇది. ఒక ఉత్సవంలా వుంటుంది. మంచి సినిమా. సెప్టెంబర్ 13న అందరూ థియేటర్స్ లో చూడండి’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఒక ఉత్సవంలానే పని చేశాను. ఈ జోనర్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. రంగస్థలం వారికి హ్యాట్సప్. డైరెక్టర్ అర్జున్ వండర్ ఫుల్ సబ్జెక్ట్ చేశారు. తను పెద్ద డైరెక్టర్ అవుతారు. ఈ సినిమాలో అన్నీ వున్నాయి. అద్భుతమైన లవ్ స్టొరీ వుంది. దిలీప్, రెజీనా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. సెప్టెంబర్ 13న అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
రైటర్ రమణ గోపిశెట్టి మాట్లాడుతూ.. సినిమా చేసి సక్సెస్ కొట్టడం చాలా కష్టమైన పని. ఇంతమంది కళాకారులతో సినిమా చేయడం ఒక యుద్ధం. ఆ యుధాన్ని దర్శకుడు అర్జున్ సాయి సక్సెస్ ఫుల్ గా చేశాడు. ఇలాంటి గొప్ప సినిమాలో నాకు మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. నిర్మాత సురేష్ గారి, సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు
లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. నా మూలం రంగస్థలం, పద్యంతోనే మొదలైయింది. అది పాట గా వెలుగుతోంది. అలాంటి రంగస్థలం పూర్వ వైభవం సంతరించుకోవాలనే గొప్ప సంకల్పంతో అర్జున్ సాయి ఈ సినిమా తీశారు. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులుని ఆద్యంతం వినోదంలో ముంచుతునే గొప్ప అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. (Story : ఉత్సవం  ప్రీరిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1