రైతులను ఆదుకోండి
న్యూస్ తెలుగు/ నూజివీడు : తుఫాను వలన భారీ ఎత్తు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి రైతు లక్ష్మణరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు జిల్లా నూజివీడు మండలం ముక్కోలుపాడు గ్రామ పరిధిలో ఆంద్రప్రదేశ్ రైతుసంఘ నాయకుల బృందం పర్యటించింది. NSP వేంపాడు ఛానల్ కాలువకు ఈ మధ్య కురిసిన వర్షాలకు గండి పడింది. దీంతో వరద నీరు వచ్చి వరి పంట పూర్తిగా దెబ్బతింది. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పర్యటన చేసింది. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, నిమ్మగడ్డ నరసింహా, కూచిపూడి నాగేశ్వరరావు, AITUC నాయకులు చాట్ల పుల్లారావు, బాధిత రైతులు పాల్గొన్నారు. (Story : రైతులను ఆదుకోండి)