UA-35385725-1 UA-35385725-1

ముఖ్యమంత్రి విపత్తు నిర్వహణ నిధికి వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల విరాళం

ముఖ్యమంత్రి విపత్తు నిర్వహణ నిధికి వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల విరాళం

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ఇటీవల విజయవాడలో వరద బాధితుల్లో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు అనేకమంది తమవంతుగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ సందర్భంలో ధర్మవరం పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ వంతుగా ముఖ్యమంత్రి విపత్తు నిర్వహణ నిధికి రూ.6,326 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు వారు విరాళాల మొత్తాన్ని చెక్కు రూపంలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ సమక్షంలో అందజేశారు. తదుపరి ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి, కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ మాట్లాడుతూ విజయవాడలో కనివిని ఎరుగని వరదలను ఆ ప్రజలు ఎదుర్కొన్నారని విపత్తు సమయములో ప్రభుత్వానికి తమ వంతు సహకారాన్ని తమ విద్యార్థుల ద్వారా అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సామాజిక బాధ్యత మరింత మంది విద్యార్థులలో స్ఫూర్తి నింపుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రమేష్, అధ్యాపకులు నరేష్, హరీష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : ముఖ్యమంత్రి విపత్తు నిర్వహణ నిధికి వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల విరాళం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1