Homeవార్తలుతెలంగాణప్రజాకవి కాళోజీ స్పూర్తిప్రధాయులు

ప్రజాకవి కాళోజీ స్పూర్తిప్రధాయులు

ప్రజాకవి కాళోజీ స్పూర్తిప్రధాయులు

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

న్యూస్ తెలుగు /ములుగు : ప్రజాకవి కాళోజీ స్పూర్తి ప్రదాయులని, వారి రచనలు అనేక మందిని, చైతన్యం వైపు నడిపించాయని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ చిత్రపటానికి, పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరిచే విధంగా కాళోజీ, అనేక రచనలు చేసారని, తెలంగాణ భాషయాసనును వ్యాప్తి చెందే విధంగా, ఆయన రచనలు ఉండేవని గుర్తు చేసారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కాళోజీ , రచనలు ఎంతో దోహదపడ్డాయని, తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిద్వనిగా కాళోజి ని కొనియాడతారని, రాజకీయ చైతన్యాల సమాహారమని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ప్రజావాదిగా ఆయన గుర్తింపు సాధించుకున్నారని, ప్రజల ప్రతి పోరాటంలో సాహిత్య పరమైన సహకరం అందీంచారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గోన్నారు. (Story : ప్రజాకవి కాళోజీ స్పూర్తిప్రధాయులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!