లే,ఔట్లు, బిల్డింగ్ పర్మిషన్ లలో అక్రమాలు విచారణ చేయాలి
న్యూస్తెలుగు/ వనపర్తి : వనపర్తి పట్టణంలో లే,ఔట్లు, బిల్డింగ్ పర్మిషన్ లలో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ చేయాలని, ప్రధాన జలాశయాల వాగులు కబ్జాకు గురయ్యాయి వాటిని సంరక్షించాలని ,ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి అఖిలపక్ష ఐక్యవేదిక వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని, రాజనగరం రోడ్డులో ఉన్న ఒక పర్మిషన్ పై no 010 368/BP/DTCP/3063/100 30/2023 గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే, వాటిని క్యాన్సల్ చేయడం జరిగింది మళ్లి దానిని కొందరు అవినీతిపరులు 013291/BP /DTCP/3067/0036/2023 నెంబర్ పై తక్కువకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీకి 28 లక్షల రావలసిన రాబడిని ఎనిమిది లక్షలు గా కుదించిన టౌన్ ప్లానర్ పై ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క టౌన్ ప్లానర్ వనపర్తిలో ఐదు కోట్ల వరకు మున్సిపాలిటీ కి నష్టం చేకూరుస్తే మిగతా టౌన్ ప్లానర్లు ఎంత నష్టం చేసి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ప్లానర్లపై ఎంక్వయిరీ చేసి ప్రభుత్వపరంగా విజిలెన్స్ కమిటీ నేతృత్వం లో విచారం చేయాలని, వనపర్తి తాళ్ళచెరువు, నల్లచెరువు, మరియు మరికొంటే చెరువుల వాగులు కబ్జాకు గురి అయ్యాయి వాటిని వాటి పరిమాణాలు గుర్తించి వాటి సైదులు సరి చేయవలసిందిగా కోరుచున్నాము. అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. అలాంటి టౌన్ ప్లానర్ల లైసెన్స్ రద్దు చేయాలని కోరుతున్నాము. తాళ్ళచెరువుపై ఉన్న వాగును కొద్దిమంది కబ్జా చేశారని బఫర్ జోన్ లో ఉన్న స్థలంలో కాంపౌండ్ వాల్ కట్టారని దానికి కొందరు అధికారులు సర్టిఫికెట్ ఇచ్చి వారికి మేలు చేయాలని చూశారని దానిపై విచారణ చేయాలని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, ఎస్సీ రాష్ట్ర నాయకులు గంధం సుమన్, బీసీ నాయకులు గౌను కాడి యాదయ్య, బి ఆర్ ఎస్ నాయకులు బొడ్డుపల్లి సతీష్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. (Story : లే,ఔట్లు, బిల్డింగ్ పర్మిషన్ లలో అక్రమాలు విచారణ చేయాలి)

