రిషభ్ పంత్ స్టోరీతో హెచ్‌డిఎఫ్‌సి ప్రొటెక్షన్ క్యాంపెయిన్
న్యూస్‌తెలుగు/ముంబై: భారతదేశంలోని ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, క్రికెటర్ రిషబ్ పంత్‌తో తన తాజా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం జీవితంలోని సవాళ్లు, అనిశ్చితులను అధిగమించడంలో సన్నద్ధత ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వ్యక్తులు, వారి కుటుంబాల కోసం టర్మ్ ప్లాన్‌లను కీలకమైన భద్రతా వలయంగా ఉంచుతుంది. ఈ ప్రచార చిత్రం రిషబ్ పంత్ బౌన్స్‌బ్యాక్ ప్రయాణానికి అద్దం పట్టే ఒక ఉత్తేజకరమైన కథనాన్ని అందిస్తుంది. రిషబ్ జీవితం అనూహ్యతను ప్రతిబింబిస్తుంది. చిన్ననాడు అతని తల్లి అన్న మాటలు అతనిని ఎదురుదెబ్బ నుండి ముందుకు నడిపించిన కీలక ఘట్టాన్ని గుర్తుచేసుకోవడాన్ని ఇది చూపిస్తుంది. సంక్షోభ సమయాల్లో జీవిత బీమా ఆర్థిక భద్రతను ఎలా అందజేస్తుందో తెలియజేస్తుంది. దూరదృష్టి, ప్రణాళిక ద్వారా ప్రతి సవాలును కూడా అధిగమించవచ్చని చాటిచెబుతూ బాగా సిద్ధమైన రిషబ్ ప్రపంచాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే ప్రస్తు తానికి కథ పరివర్తన చెందుతుంది. (Story : రిషభ్ పంత్ స్టోరీతో హెచ్‌డిఎఫ్‌సి ప్రొటెక్షన్ క్యాంపెయిన్)