మహిళలకు మగ్గం స్టాండ్ లు ఉచితంగా పంపిణీ
ఎసై ఎస్కె తాజుద్దీన్
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం (ములుగు ) : ఏటూరునాగారం లోని,షిర్డీసాయి బాబా దేవాలయం, కమిటీ ఆధ్వర్యంలో సాయి ఫంక్షన్ హాల్లో,నిర్వహిస్తున్న మగ్గం, ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రాన్ని మాజీ జడ్పి కో ఆప్షన్ సభ్యురాలు వాలియాబీ సలీం సోమవారం సందర్చించారు. నేర్చుకుంటున్న మహిళలతో,సమావేశం నిర్వహించారు. మహిళలు కూడా వారు నేర్చుకుంటున్న ఉపాధి గూర్చి వివరించారు.అంతేకాకుండా స్థానిక ఎస్ ఐ ఎస్కె తాజుద్దీన్ చేతుల మీదుగా మొదటి బ్యాచ్ మహిళలకు రేపటితో ముగుస్తుండగా, వారికి ఎస్. ఐ తాజుద్దీన్ 35 మందికి,మగ్గం స్టాండ్ లు సోమవారం ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే వారితో నేర్చుకుంటున్న, పని గూర్చి మహిళలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పర్వతాల కుమార స్వామి, ప్రధాన కార్యదర్శి బచ్చు సతీష్, కోశాధికారి వెంకట్రావు, సహాయ కార్యదర్శి గంజి రమేష్, సలహాదారు నర్సింహా చారి,పెద్దలు మాధవ్, రాజ్ కుమార్ శిక్షణరాలు ఆనంతుల రజిత, సృజన మగ్గం వర్క్ నేర్చుకుంటున్న మహిళలు తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.