సాలూరు టెర్రరిస్ట్ పాలనను తలపించేలా ఐదేళ్ల వైసిపి పాలన
ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు ఏడాది
ఈరోజు యావత్ తెలుగుజాతి మర్చిపోలేని రోజు మంత్రి గారు.
అరెస్ట్ అయినా ఏ రాజకీయ నేతకు ఇలాంటి సంఘీభావం రాలేదంటే అతిశయోక్తి కాదు
అభివృద్ధి లక్ష్యంగా కూటమి పాలన మంత్రి సంధ్యారాణి
న్యూస్‌తెలుగు/ అమరావతి : చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారు. నీతి, నిజాయితీ, చట్టబద్ధత, పారదర్శకత చంద్రబాబు గారి ప్రత్యేకత, అందుచేతనే చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు చేస్తే వర్గాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ ఖండించారని మంత్రి సంధ్యారాణి గారు తెలిపారు.
అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి, దేశవ్యాప్తంగా మద్దతు పలికారు, 70 దేశాల్లో చంద్రబాబుకు సంఘీభావ ప్రదర్శనలు చేశారు
విడుదలైన రోజు రాజమండ్రి నుండి విజయవాడ చేరడానికి రాత్రంతా జనం రోడ్లపై జాగారం చేసి చంద్రబాబు గారికి స్వాగతం పలకడం వల్ల తెల్లవారే దాకా అంటే 12 గంటల పట్టింది.
చంద్రబాబు గారికి నేరఘటనలో భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమికంగా కనిపించడం లేదు. రికార్డులను పరిశీలిస్తే కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత ఆయనను నిందితుడిగా చేర్చినట్లు స్పష్టమవుతున్నది. అంతేకాక ఆయనను అరెస్ట్ చేయడానికి ముందు మాత్రమే నమోదు చేసినట్లు తేటతెల్లమవుతుంది.
నాలుగు దశాబ్దాలుగా ప్రజల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తూ ఎటువంటి మార్చలేని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్ రెడ్డి తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్టు చేసి నేటికీ ఏడాది అవుతుంది.
ఏ తప్పు చేయకపోయినా, అవినీతికి పాల్పడినట్టు ఎటువంటి ఆధారం లేకపోయినా జగన్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
సైకోతీరుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేసేలా చేశారు.
అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే కేసు, నిలదీస్తే అక్రమ అరెస్టుగా ఐదేళ్ల వైసీపీ పాలన సాగింది, జగన్ డైరెక్షన్ తో 2023 సెప్టెంబర్ 9 న చంద్రబాబు నాయుడు గారిని నాటి డిఐజి కొల్లి రఘురామిరెడ్డి వేలాదిమంది పోలీసులను తరలించి అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసినప్పుడు రోడ్లమీదకు వచ్చిన ప్రజలపై కూడా పోలీసులు లాఠీలతో దాడులు చేశారు.
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా 70 దేశాల్లో తెలుగు ప్రజలు ఉప్పెనల నిరసన తెలియజేశారు, యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ లో మొదట 3 వేల కోట్ల అవినీతి అని. ఆ తర్వాత 300 కోట్లు అని.. ఆ తర్వాత 30 కోట్లు అని… చివరికి మూడు పైసలు కూడా అవినీతికి పడినట్టు నిరూపించలేకపోయారు.
వైసిపి అవినీతి, అరాచకాలకు అక్రమ అరెస్టులకు నిరసనగా తెలుగు ప్రజలు చరిత్రలో నిలిచిపోయేలా వైసిపిని 11 సీట్లకే పరిమితం చేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు.
జగన్ తన లూటి నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారే లక్ష్యంగా రాజధాని భూమిలో ఇన్సైడ్ ట్రేడింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమాలంటూ తప్పుడు కేసులు నమోదు చేశారు వారి ఆరోపణలకు కనీస ఆధారాలు చూపలేకపోయారు.
ఐదేళ్ల జగన్ పాలనలో చంద్రబాబు నాయుడు గారిపై 12 కు పైగా తప్పుడు కేసులు నమోదు చేశారు. సిట్ ఇన్చార్జిగా రఘురామిరెడ్డిని నియమించి ఫైబర్ నెట్, స్కిల్, అమరావతి కేసుల్లో టిడిపి నేతలను వేధించేందుకు ప్రయత్నించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తుంది. వృద్ధాప్య పెన్షన్ 4వేలకు పెంచడం, 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ, స్కిల్ సెన్సస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ శరవేగంగా ప్రజా రాజధాని అమరావతి పోలవరం నిర్మాణం, ప్రకృతి విపత్తుల సమర్థ నిర్వహణ వంటి వాటిపై దృష్టి పెట్టింది.
ఐదేళ్ల జగన్ పాలన లూటీలు, నేరాలు, కక్షులకు, కార్పన్యాలతో కాలం వెళ్ళబుచితే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతుంది. అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాలుగు మండల అధ్యక్షులు పాల్గొన్నారు (Story : సాలూరు టెర్రరిస్ట్ పాలనను తలపించేలా ఐదేళ్ల వైసిపి పాలన )