జిపిఎస్ కలిగి ఉన్న వాహనాలకు మాత్రమే ఇసుక పంపిణీ
త్వరలో తేదీ ప్రకటించబడుతుంది.. ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రభుత్వ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇకనుంచి నూతన ఇసుక విధానం అమలులో ఉంటుందని, జిపిఎస్ కలిగి ఉన్న వాహనాలకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించపడుతుందని, త్వరలో ఇసుక రవాణా పంపిణీ చేయు తేదీని కూడా ప్రకటించడం జరుగుతుందని ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక వినియోగదారుల బుకింగ్ రవాణా వ్యవస్థలను మరింత సులభతరం చేస్తున్నామని తెలిపారు. ఇసుకను కేవలం స్టాక్ యాడ్ నుంచి మాత్రమే తీసుకోవాలని తెలిపారు. నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం సీసీ రేవు నందు, ముదిగుబ్బ మండలం పిసి రేవు నందు మాత్రమే ఇసుకను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇసుకను రవాణా చేసే వాహనాలు జిపిఎస్తో అనుసంధానం అయి ఉండాలని తెలిపారు. అలా ఉంటేనే ఇసుక అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను పంపిణీ చేస్తామని తెలిపారు. ఇసుక కావలసినవారు ముందుగా ఆన్లైన్లో మాత్రమే అమ్మకాలు జరిపడం జరుగుతుందని ప్రతిరోజు నిర్దిష్ట సంఖ్య ప్రకారం మాత్రమే ఇసుక ఇవ్వబడుతుందని తెలిపారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆక్ట్ ప్రకారం ఇసుకను అనుమతిస్తామని ఇసుక బుకింగ్ సచివాలయ ఉద్యోగులచే రెండు షిఫ్టులలో జరుగుతుందని తెలిపారు. డంపింగ్ పాయింట్ వద్ద సంబంధిత అధికారులు పోలీసులు ఉంటారని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలించకుండా రాళ్ల అనంతపురం, గరిసెలపల్లి ల వద్ద చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇసుక తీసుకునే చోట పార్కింగ్ సౌకర్యం కూడా చేయడం జరిగిందని, వరుస సంఖ్యలో వాహనాలు మాత్రమే పంపించడం జరుగుతుందని తెలిపారు. స్టాక్ యాడ్ వద్ద మండల సర్వేయర్లు ఉంటారని తెలిపారు. ఇసుక రవాణా వద్ద, పాయింట్ వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉంటాయని తెలిపారు. కావున ప్రభుత్వం జారీ చేసిన మేరకు ఇసుక అవసరాల ఉన్నవారు చట్టపరంగా తాము నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారమే ఇసుక పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఇసుక వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. (Story : జిపిఎస్ కలిగి ఉన్న వాహనాలకు మాత్రమే ఇసుక పంపిణీ )