పరిసర ప్రాంతాల్లో నిలువ నీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలి
న్యూస్తెలుగు/ వనపర్తి : పరిసర ప్రాంతాల్లో నిలువ నీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఉదయం నుండి పెద్దమందడి మండలంలోని జంగమాయ పల్లి, ఘనపూర్ మండలంలోనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, గనప సముద్రం రిజర్వాయర్, కర్నెతాండా, గోపాలపేట మండలంలో పర్యటించారు. వ్యవసాయ రుణ మాఫీ కానీ రైతులు దరఖాస్తులు చేసుకోండి పెద్దమందడి మండలంలోని జంగమాయ పల్లి గ్రామంలో వ్యవసాయ రుణమాఫీ కానీ రైతుల నుండి వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు దరఖాస్తులు తీసుకొని ఆన్లైన్ దరఖాస్తు చేస్తున్న సందర్భంగా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడిన కలక్టర్ రైతులు ఆందోళన పడవద్దని వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో అర్హులైన 25 మంది రైతులకు రుణ మాఫీ కావాల్సి ఉందని వ్యవసాయ అధికారి కలక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అన్ని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పారిశుధ్య పనులు చేయించాలనీ జి.సి.డి. ఒ శుభలక్ష్మినీ కలక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవనానికి విద్యుత్, దర్వాజలు త్వరగా అమర్చి పనులు పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ సహాయ ఇంజనీర్ ను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి, జి.సి.డి. ఒ శుభలక్ష్మి, ఘనపూర్ తహసిల్దార్ పాండు, ఎంపిఓ తదితరులు ఉన్నారు. (Story : పరిసర ప్రాంతాల్లో నిలువ నీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలి)