పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు
మట్టి వినాయకులను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలని టీడీపీ మాజీ ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా పోతలయ్య తెలిపారు. స్థానిక వన్డేన్ పోలీస్ స్టేషన్ లో గురువారం టీడీపీ పట్టణాధ్యక్షుడు పరిసే సుధాకర్, మాజీ ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా పోతలయ్య, నాయకులు ఆనంద్, ఇస్మాయిల్, నాగరాజు తదితరులు వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్, పోలీసులకు మట్టివినాయక విగ్రహాలను అందించి సిఐను శాలువాలతో సన్మానించారు. ప్రతిఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని వారు తెలిపారు. (Story : పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు)