జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ఏపీ రైతు సంఘం డిమాండ్
న్యూస్‌తెలుగు/ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని ఏ కొండూరు మండలం కవులూరు గ్రామంలో ఏపీ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుజ్జల ఈశ్వర్, కె వి వి ప్రసాద్ బుడమేరు వరద బాధితులను బుధవారం పరామర్శించారు. పంట పొలాలన్నీ నేటి మునిగాయి. గ్రామస్తుల నివాస ప్రాంతాలన్నీ కూడా వరద నీటీలో మునిగిపోయాయి. బుడమేరు పరిసర ప్రాంతాలన్ని ఆస్తి నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. కోట్లాది రూపాయల ప్రభుత్వ, ప్రజల, ప్రైవేట్ ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు సంఘం రాష్ట్ర నాయకుల బృందం తమ పరిశీలనలో తేలిందని ప్రకటించారు. అందుకే ఎన్టీఆర్ జిల్లాలో, ప్రధానంగా విజయవాడ నగరం, బుడమేరు పరిసర ప్రాంతాలన్నీ జల సమాధి అయినాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విపత్తుగా ప్రకటించి, యావత్తు ప్రజానీకాన్ని యుద్ధ ప్రతిపాదికన ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర సహాయక బృందాలు కూడా జిల్లాకు చేరుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులతో తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కవులూరు సందర్శనలో వీరితోపాటు బుడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : జాతీయ విపత్తుగా ప్రకటించాలి)