ఆర్మీ క్యాంపులో సీతం కళాశాల ఎన్‌సీసీ క్యాడట్స్
న్యూస్‌తెలుగు/విజయనగరం: స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు ఎన్సిసి కేడేట్స్ ఆగస్టు 19 నుండి 28 వరకు జరిగిన ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్ లో పాల్గొన్నారు. ఈ క్యాంప్ 68 ఆర్టిలరీ రెజిమెంట్, భువనపల్లి, సికింద్రబాద్లో ఎన్సిసి డైరెక్టరేట్ ఆంధ్ర తెలంగాణ ఆధ్వర్యంలో జరిగింది. వివిధ విభాగాలకు చెందిన ఎం. అచ్చుత రావు, సిహెచ్ వేణుగోపాల్, డి. నూతన్ కుమార్ క్యాంప్ లో పాల్గొన్నారు.విద్యార్థులకు ఆర్మీ ఆయుధాలను, ట్యాంకర్లు మొదలయిన వాటిని చూపించి వాటి ఉపయోగాలను తెలియజేసారు. ఈ క్యాంపులో హాజరైన క్యాడట్స్ కు,సీ సర్టిఫికేట్ పరీక్షలో మార్కులు కలుస్తాయి. విద్యార్థులు క్యాంప్ పూర్తి చేసుకొని వచ్చిన సందర్బంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.వి.రామమూర్తి , వివిధ విభాగాదిపతులు, లెఫ్టినెంట్ ఎం. వరలక్ష్మి, లెఫ్టినెంట్ ప్రశాంత్, , సి.ఎస్.ఓ కె. సత్యనారాయణ, అధ్యాపకులు, ఇతర సిబ్బంది, ఎన్.ఎన్.సి కాడెట్స్, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. (Story: ఆర్మీ క్యాంపులో సీతం కళాశాల ఎన్‌సీసీ క్యాడట్స్)