దోమల నివారణకు ముందస్తు చర్యలు
న్యూస్‌తెలుగు/వనపర్తి: వనపర్తి జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ఇంటి మిద్దెలు, పాత టైర్లు, కుండలు ఇతర ప్లాస్టిక్ సమాన్లలో నిలువ నీరు ఉండకుండా ఎప్పటికప్పుడు పారవేసే విధంగా డ్రై డే కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించి దోమలు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం వనపర్తి మండలంలోని అచ్యుతాపుర్, పెద్దమందడి, అనకాయపల్లి తాండా లో కలక్టర్ పర్యటించారు. డ్రై డే కార్యక్రమం నిర్వహణతో పాటు అంకాయపల్లి తాండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పెద్దమందడి కస్తూరిబా బాలికల విద్యాలయంలో అమ్మ ఆదర్శ పాటశాల పనుల పురోగతిని పరిశీలించారు. డ్రై డే సందర్భంగా గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిన ఇంటిని సందర్శించారు. పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలక్టర్ ఒ.పి రిజిస్టరు, ఈ.డి.డి, స్టాక్, రక్త నమూనాల పరీక్షల రికిష్టర్లను తనిఖీ చేశారు.
జ్వరం వచ్చిన ప్రాంతంలో పారిశుధ్య పనుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చుట్టుప్రక్కల ప్రాంతంలో నిల్వ నీరు లేకుండా చేయటంతో పాటు ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు.
పెద్దమందడి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశికించడంతో పాటు పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని, విద్యార్థుల మెస్ కమిటీ ద్వారా సరకుల నాణ్యత దృవీకరణ చేయించి రిజిస్టరులో సంతకాలు తీసుకోవాలని సూచించారు. పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఈ మధ్యకాలంలో వచ్చిన అవుట్ పేషంట్లు, అందులో జ్వరంతో వచ్చిన వారు ఎంతమంది, ఎంతమందికి రక్త నమూనాలు సేకరించారు వాటిలో పాజిటివ్ కేసులు ఎన్ని అని ప్రశ్నించారు. బర్త్ ప్లాన్ ఈ.డి.డి రిజిస్టరు ను పరిశీలించారు. రక్త నమూనాలు సేకరించి ఎలిజా పరీక్షకు పంపించాలని సూచించారు. పాముకాటు, కుక్క కాటుకు మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. వర్షాల వల్ల నష్టపోయిన పంటల వివరాలు సేకరించి నివేదికను త్వరగా ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు
జిల్లాలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో ఎక్కడెక్కడ ఏయే పంట నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది అనే పూర్తి వివరాలు సేకరించి నివేదికను త్వరగా ఇవ్వాలని వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ ను ఆదేశించారు. వరి, జొన్న, పత్తి పంటలు నీట మునగటం, జొన్న చేను పడిపోవడం జరిగిందని, వ్యవసాయ విస్తిర్ణాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలు సేకరించాలని ఆదేశించారు.
అచ్యుతాపుర్, చిన్నమందడి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ వ్యవసాయ అధికారులు వ్యవసాయ రుణం మాఫీ కానీ అర్హులైన రైతుల నుండి అఫిడవిట్ ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. రైతుల వివరాలు తీసుకొని తప్పులు లేకుండ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఆర్డీఓ పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ నాయక్ , జిల్లా వైద్య శాఖ అధికారి జయచంద్ర మోహన్, జి.సి.డి. ఒ శుభలక్ష్మీ, వనపర్తి తహసిల్దార్ చాంద్ పాషా, పెద్దమందడి తహసిల్దార్ వెంకటేశ్వర్లు, యం.ఈ.ఒ శ్రీనివాస్ గౌడ్, శివశంకర్, ఎంపీడీఓ లు, తదితరులు ఉన్నారు. (Story: దోమల నివారణకు ముందస్తు చర్యలు)