మంకీపాక్స్’ తో జాగ్రత్తగా ఉండాలి
హైదరాబాద్: మంకీపాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలని అపోలో క్రెడిల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ (కొండాపూర్) జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మల్లా దేవి వినయ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రకటన విడుదల చేశారు. మంకీపాక్స్ ను ఇప్పుడు ఎంపాక్స్ అంటున్నారని పేర్కొన్నారు. ఇది ఎంపాక్స్ వైరస్ వల్ల కలిగే వైరల్ జూనోటిక్ ఇన్‌ఫెక్షన్ అన్నారు. ఇది మశూచి వలే దద్దుర్లు కలిగి ఉంటుందన్నారు. వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. మరణాలు తక్కువగా ఉన్నాయని, కానీ చిన్న పిల్లలు, గర్భిణులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. జంతువు నుంచి మనిషికి.. ఇది సోకిన జంతువుల శరీర ద్రవాలు ఇతరత్రా ద్వారా సోకుతుందన్నారు. ఇక మనిషి నుంచి మనిషికి పుండ్లు, స్కాబ్స్, శరీర ద్రవాలు, శ్వాసకోశ స్రావాల ద్వారా అంటుకుంటుందని తెలిపారు. ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకిన తర్వాత లక్షణాలు కనిపించడానికి సాధారణంగా 5 నుంచి 13 రోజులు పడుతుందని పేర్కొన్నారు. (story : మంకీపాక్స్’ తో జాగ్రత్తగా ఉండాలి)