సెప్టెంబరు 6న ఖాళి టిన్‌ల విక్రయానికి సీల్డ్ టెండర్ల ఆహ్వానం
న్యూస్‌తెలుగు/తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లు సీల్డ్ టెండర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. టెండర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళి టిన్‌లు సేకరించవచ్చు.
తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండర్లు సెప్టెంబరు 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు అందజేయవలెను. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు. (Story: సెప్టెంబరు 6న ఖాళి టిన్‌ల విక్రయానికి సీల్డ్ టెండర్ల ఆహ్వానం)
See Also:
అక్టోబరు 8న గరుడ సేవ దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాలు నిషేధం