పట్టు చీరల డబ్బులు ఇప్పించండి..
ధర్మవరం వ్యాపారి ఆవేదన
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గంలోని చంద్రగిరికి చెందిన కందుకూరి గాయత్రి నమ్మకంగా వ్యాపారం చేస్తూ నన్ను 50 లక్షల వరకు మోసం చేసిందని ధర్మవరం వస్త్ర వ్యాపారి ముత్తు శక్తి సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలుగా పట్టు చీరలను గాయత్రి తీసుకుంటూ నమ్మకంగా వ్యాపారం చేసేదని, ఇటీవల కొన్ని నెలల కిందట తాను ధర్మారం నుంచి పట్టుచీరలను గాయత్రీ కి ఇవ్వడం జరిగిందని తెలిపారు. తీసుకున్న సరుకుకు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించానని తెలిపారు. తదుపరితాను చంద్రగిరి లోని గాయత్రి ఇంటికి వెళ్లడం జరిగిందని, అక్కడ వారం రోజుల నుంచి పడి కాపులు కాసినా కూడా ఆమె స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. గాయత్రి ధర్మవరంలో తనతో పాటు మరికొందరిని కూడా మోసం చేసినట్లు వారు వివరించారు. ఇదే తరహాలో తమిళనాడు వ్యాపారులను మోసం చేసి 20 కోట్లు కూడా కాజేసిందని తమిళ నాడు మీడియా కథనాలను చూపించారు. తనకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. ఇంటిముందు నిరసన తెలుపుతూ ఉంటే పోలీసులతో అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. నాకు న్యాయం జరిగేంతవరకు నేను దేనికైనా సిద్ధమని వారు తెలిపారు. ఇలాంటి మోసగాళ్లను ప్రజా పాలకులు, పోలీసులు గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేనేత వ్యాపారస్తులకు కూడా తెలుపుతున్నారు. (Story ” పట్టు చీరల డబ్బులు ఇప్పించండి.. )