కనుల పండగగా బోనాల ఊరేగింపు
న్యూస్‌తెలుగు/వినుకొండ : ఇందిరా నగర్ కు చెందిన ఒడియ రాజుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అంకాలమ్మ బోనాల కార్యక్రమాన్ని అత్యంత వైభవ పేతంగా కనులు పండగల నిర్వహించారు. కార్యక్రమాన్ని ఇందిరానగర్ నుండి మహిళా భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని తమ తమ ఇళ్ల వద్ద పొంగళ్ళు వండుకొని ర్యాలీగా నరసరావుపేట రోడ్డు నుండి శివయ్య స్తూపం సెంటర్ మీదుగా, పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు నందు గల అంకాలమ్మ దేవస్థానం నందు వారి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర చెరువులన్నీ నిండి కలకలాడుతున్న ఈ తరుణంలో పట్టణానికి చెందిన వడియ రాజులు తరతరాలుగా ప్రతి సంవత్సరం వర్షాల కురవాలని అమ్మవారికి మొక్కులు తీరుస్తున్నారని, ఇదో సాంప్రదాయమని ఆయన అన్నారు. టిడిపి నాయకులు పీవీ సురేష్, పత్తి పూర్ణ, సౌదాగర్ జానీ భాష, ఒడియ రాజుల సంఘం అధ్యక్షులు చల్ల కుమార్, ట్రెజరర్ ఎర్ల వాసు, ఉప సర్పంచ్ దేవల్ల యేసు పాదాలు, సెక్రెటరీ ప్రసాదు, దేవుళ్ళ గోవిందు, సంఘం పెద్దలు బత్తుల శ్రీను, తమ్మిశెట్టి వెంకటస్వామి, బండారు వెంకట కోటయ్య, తురక ఏడుకొండలు, వేముల గోవిందు, చల్ల శివయ్య, బండారు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. (story : కనుల పండగగా బోనాల ఊరేగింపు)