Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఉపేంద్ర

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఉపేంద్ర

0

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఉపేంద్ర

గాలం వేసి పట్టిన యువకుడు

దాదాపు 20 మంది కు లక్షల్లో మోసం చేసిన వైనం

టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన బాధితులు

న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :
కడప జిల్లా పత్తికొండ మండలానికి చెందిన వడ్డే ఉపేంద్ర గత కొన్ని నెలలుగా నిరుద్యోగులకు ఎరవేసి లక్షలు గడిచిన వైనం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళితే వడ్డే ఉపేంద్ర బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసుకొని, కొన్ని నెలలుగా తిరుపతి తదితర ప్రాంతాలలో సూటు బూటు వేసుకొని నిరుద్యోగులకు ఎరవేస్తూ లక్షల్లో గడించాడు. ఇతని కోసం దాదాపు 20 మంది నిరుద్యోగులు గత ఆరు నెలలుగా వెతక సాగారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణం మారుతీ నగర్ కు చెందిన నరేష్ బీటెక్ విద్యార్థి, ఉపేంద్ర తో గత కొన్ని నెలల కింద ట పరిచయం కావడం జరిగింది. తదుపరి నిరుద్యోగులను నమ్మబల్కుతూ, మోసపూరితమైన మాటలతో నిరుద్యోగులను వల వేసుకున్నాడు ఉపేంద్ర. చివరకు నరేష్ ఊరు అయినా పత్తికొండకు కూడా వెళ్లి రావడం జరిగిందని, అక్కడ కూడా లేకపోవడంతో తాను ఉపేంద్రకు దాదాపు ఒకటిన్నర లక్ష రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి, ఫోన్ పే ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న నరేష్, ఉపేంద్ర కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ధర్మవరం రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి అనుకోకుండా ఉపేంద్ర కనపడడంతో, తన కుటుంబ సభ్యులతో ఉపేంద్రను పట్టుకొని, డబ్బు ఇవ్వాలని తెలపడం జరిగింది. కానీ ఏమాత్రం స్పందన లేకపోవడంతో, రైల్వే ఆర్పిఎఫ్ కార్యాలయానికి వెళ్ళగా, ఇది రైల్వేకు సంబంధించినది కాదు, టూ టౌన్ పోలీస్ వెళ్లాలని రైల్వే పోలీసులు సలహా ఇచ్చారు. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. అంతేకాకుండా పత్తికొండ లో తల్లిదండ్రులకు తెలియకుండా ఐదు లక్షలు అప్పులు చేసి, ఆరు నెలలుగా తిరుగుతూ ఉన్నాడని తెలిపారు. నరేష్ మాట్లాడుతూ నాతో పాటు 20 మందికి పైగా నిరుద్యోగులను మోసం చేశాడని తెలిపాడు. ఏది ఏమైనా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తాము ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. (Story : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఉపేంద్ర)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version