జే ఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ పై చర్యలు గైకొనండి
జోలి శాఖ మంత్రి సవితకు, హ్యాండ్లూమ్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన సిపిఐ నాయకులు
న్యూస్‌తెలుగు /ధర్మవరం(శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణ పరిధిలోని జేఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో రిజర్వేషన్ ఉలంగిస్తున్న వారిపై తగు చర్యలు గైకొలాలని కోరుతూ జౌలీ శాఖ మంత్రి సవితకు, హ్యాండ్లూమ్ కమిషనర్ కు సిపిఐ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ , ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చేనేత రిజర్వేషన్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జేఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ పనిచేస్తుందని, రిజర్వేషన్ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తోందని వారు తెలిపారు. చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా పవర్ రూమ్లో పట్టుచీరలు తయారు చేస్తున్నారని, రిజర్వేషన్ చట్టాన్ని కాపాడాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి చేనేత కార్మికుల కష్టానికి శాపంగా మారడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే పట్టణంలో చేనేత కార్మికులు గిట్టుబాటు ధర లేక పెరిగిన ధరలతో కుటుంబాన్ని పోషించుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నదని వారు తెలిపారు. ఈ ఆత్మహత్యలన్నీ కూడా జోలీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ నిఘా వైఫల్యమే అని వారు మండిపడ్డారు. ఇప్పటికే ఒకే బిల్డింగులో నోరు అంటే 200 పవర్లూమ్స్ మగ్గాలు నడుపుతున్నారంటే సంబంధిత అధికార యంత్రాంగం ఎంతవరకు వైలేషన్ అడ్డుకున్నారు అనేది అర్థమవుతుందని తెలిపారు. చేనేత బకాసులను వదిలి ఒకటి రెండు పవర్ లూమ్స్ మగ్గాలు నిర్వహిస్తున్న యాజమాన్యంపై కేసులు పెట్టడం తూతూ మంత్రంగా చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. చేనేత రిజర్వేషన్ అమలు కానివ్వకుండా అడ్డుకుంటున్న బడా బాబులపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం పై అధికారులు శీతకన్ను చూపిస్తున్నారనేది దీనికి నిదర్శనం అని తెలిపారు. 2019 లేబర్ యాక్ట్ నిబంధనలో ఫ్యాక్టరీలో అదే ప్రాంతానికి చెందిన 80 శాతం మంది కార్మికులు ఉండాలని ఉన్నప్పటికీ, ఆ యాజమాన్యం చెత్త విరుద్ధంగా పవర్లూమ్స్ లో పట్టు చీరలు నేస్తున్న విషయాన్ని బయటకు వస్తుందని ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల కార్మికులను అక్కడ పని కల్పించడం జరిగింది అని తెలిపారు. ఇప్పటికైనా జెఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. (Story : జే ఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ పై చర్యలు గైకొనండి)