సత్య కళాశాల ఎన్ సి సి కే డేట్స్ ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్
న్యూస్‌తెలుగు/విజయనగరం : పట్టణంలో తోటపాలెం వద్ద ఉన్న సత్య డిగ్రీ& పీజీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు ఎన్ సి సి కేడేట్స్ ఆగస్టు 19 నుండి 28 వరకు జరిగిన ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్ లో పాల్గొన్నారు. ఈ క్యాంప్ 61 ఆట్లరీ రెజిమెంట్, భువనపల్లి, సికింద్రబాద్ లో ఎన్ సి సి డైరెక్టరేట్ ఆంధ్ర మరియు తెలంగాణ ఆధ్వర్యం లో జరిగింది. దీనిలో కళాశాలకు చెందినఈ. భాస్కర్ , జే యు ఓ ర్యాంక్ , ఆర్. చరణ్ తేజ, సి పి ఎల్ ర్యాంక్, జి. కార్తీక్, సి పి ఎల్ ర్యాంక్
ఈ క్యాంప్ లో విద్యార్థులకు ఆర్మీ ఆయుధాలను, ట్యాంకర్లు మొదలయిన వాటిని చూపించి వాటి ఉపయోగాలను తెలియజేసారు. విద్యార్థులకు ఈ క్యాంప్ చాలా ఉపయోగపడుతుంది మరియు వాళ్ళ సీ సర్టిఫికేట్ పరీక్ష లో మార్కులు కూడా కలుస్తాయి.
విద్యార్థులు క్యాంప్ పూర్తి చేసుకొని వచ్చిన తరువాత కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, ఎన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ ఎం సత్య వేణి మరియు ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి. సూరపు నాయుడు విద్యార్థులను అభినందించారు. (Story : సత్య కళాశాల ఎన్ సి సి కే డేట్స్ ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్ )