ట్రెజరీ అధికారుల నిర్ణయాలకు ఆర్టీసీ ఎన్ఎంయు సంఘం నాయకులు నిరసన
న్యూస్‌తెలుగు /ధర్మవరం:(శ్రీ సత్య సాయి జిల్లా) నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ ఉద్యోగుల నెలవారి జీతం లో రావలసిన అలవెన్స్లను ట్రెజరీ అధికారులు నిలుపదల చేసిన దానికి నిరసనగా డిపోలో ఉదయం డ్యూటీ నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి డ్యూటీలకు హాజరు కావడం జరిగింది. అనంతరం గేట్ మీటింగ్ ద్వారా తమ నిరసనలు తెలియజేశారు. జోనల్ నాయకులు ప్రేమ్ కుమార్ రీజినల్ చైర్మన్ ముత్యాలప్ప మాట్లాడుతూ ట్రెజరీ వారు అన్ని అరియర్స్ను కలపవలెనని తెలియజేయడం జరిగిందని, కానీ ఇంతవరకు స్పందన లేకపోవడం దారుణం అన్నారు. అదేవిధంగా కండక్టర్లు డ్రైవర్లకు నైట్ అలవెన్స్ పునరుద్దించాలని, జీవో నెంబర్ 114 లోని అలవెన్స్లను అమలు చేయాలని, పీటీడీ వేతన బకాయిలు ఆరియర్స్ గా చెల్లించాలని, పిటిడి రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాజిటీ, ఆర్జిత లీవుల బకాయిలను చెల్లించాలని, అర్హులైన వారికి ఏ ఏ ఎస్ లు, ఇంక్రిమెంట్ అరియర్స్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో చైర్మన్ ను కార్యదర్శి హనుమాన్, మధు, గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులు కుమార్, హరి, సీనియర్ నాయకులు ఎస్ఎం షాబ్ ,పిఎస్ కాన్, వైయస్సార్ రెడ్డి, మోహన్, దుర్గాప్రసాద్, ఎంసీజీ రావు, నాయక్, గౌడ్, కోమలాదేవి, జాన్, రాజేశ్వరి, ట్రాఫిక్కు, గ్యారేజ్ ఉద్యోగులు పాల్గొన్నారు. (Story : ట్రెజరీ అధికారుల నిర్ణయాలకు ఆర్టీసీ ఎన్ఎంయు సంఘం నాయకులు నిరసన)