అవమానించారు.. అందుకే అభివృద్ధి చేయలేకపోయాను
న్యూస్‌తెలుగు/వినుకొండ : తాను వైసిపి అధికార పార్టీ మున్సిపల్ చైర్మన్ గా గెలిచి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ. అప్పటి ప్రజాప్రతినిధి నుండి మున్సిపల్ అధికారుల నుండి సహకారం లేని కారణంగా పట్టణాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేకపోగా, ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోయానని మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దాస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు.. శనివారం మున్సిపల్ కౌన్సిల్ నందు అత్యవసర సమావేశం జరిగింది.. అజెండాలోని 26 అంశాల్లో 26వ అంశం రద్దు చేయగా ఆరు అంశాలను ఆయా అవార్డుల సభ్యులు రాని కారణంగా వాయిదా వేసి మిగతా అంశాలన్నీ సమావేశం ఆమోదించినట్లు చైర్మన్ డాక్టర్ దస్తగిరి తెలిపారు. సమావేశానికి ముందుగా తన నాలుగేళ్ల పాలనలో తాను పడ్డ అవమానాలను వివరించారు. తాను డాక్టర్ ప్రాక్టీస్ కొంతమేర విడనాడి పట్టణాన్ని అభివృద్ధి చేద్దామని ఆశతో రాజకీయాలలోకి వచ్చి చైర్మన్ అవ్వడం జరిగిందని. అయితే ఆనాటి నుండి అప్పుడు ప్రజాప్రతినిధి నుండి ఎటువంటి సహకారం లేని కారణంగా మున్సిపల్ అధికారులు కూడా తనను చిన్నచూపు చూస్తూ వచ్చారన్నారు. అందువల్లనే పట్టణంలో జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కౌన్సిలర్ అయిన తన భార్య షకీలా దస్తగిరిని పంపుతూ వచ్చానన్నారు. తాను చైర్మన్ అయిన తొలి దశలో గుడ్ మార్నింగ్ వినుకొండ అంటూ. ప్రతిరోజు ఆ అవార్డులకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించానన్నారు. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు. అయితే అజెండాలో పొందుపరిచే అంశాలు కూడా అధికారులు తనని తెలియకుండా నిర్లక్ష్యం చేసే వాళ్ళని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వినుకొండ ముస్లింల కోసం షాదికాన నిర్మించేందుకు కోటి రూపాయలు మంజూరు చేశానని. అయితే స్థలం చూపని కారణంగా నిధులు మురిగిపోయాయి అన్నారు. వైసీపీ ప్రభుత్వం తరుపున తాను చైర్మన్గా పోటీ చేసినప్పటికీ. తనకు ఎటువంటి సహకారం ఇవ్వలేదని, అందువల్లే పట్టణంలో అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేయలేకపోయాను అన్నారు. తన చాంబర్ కు డెకరేషన్ ఖర్చు కూడా తానే సొంతగా పెట్టుకుని బిల్లు పెట్టుకున్నప్పటికీ. నేటి వరకు ఆ బిల్లు ఇవ్వలేదన్నారు….. కాగా ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలపై సమావేశం దృష్టికి తెచ్చారు.. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, డి ఈ వెంకయ్య, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : అవమానించారు.. అందుకే అభివృద్ధి చేయలేకపోయాను)