పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం :
జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో “పోలీసు వెల్ఫేర్ డేనిర్వహించి, వారి నుండి విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించుటలో భాగంగా పోలీసు సిబ్బంది ఒక్కొక్కరిని జిల్లా ఎస్పీ పోలీసు కార్యాలయంలోని తన చాంబరులోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకొని, వారి నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది విజ్ఞాపనలు పరిశీలించిన జిల్లా ఎస్పీ, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. పోలీసు సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను జిల్లా ఎస్పీ స్వయంగా నోట్ చేసుకొని, వాటి పూర్వాపరాలు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానన్నారు. పోలీసు సిబ్బంది నుండి వచ్చిన విజ్ఞాపనల్లో సిబ్బంది బదిలీలు, ప్రమోషన్స్, అనారోగ్య సమస్యలు, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలను నిలిపి వేయాలని కోరుతూ వచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐలు కే.కే.వి. విజయనాధ్, ఎ.వి.లీలారావు పాల్గొన్నారు. (Story : పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు)