విద్యుత్ పోరాట అమరుల త్యాగం
చిరస్మరణీయం : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని సిపిఐ నేతలు అన్నారు. వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్ లో ఆగస్టు 28, 2000 సంవత్సరం హైదరాబాద్ బషీరాబాద్ లో విద్యుత్ పోరాటం సందర్భంగా పోలీస్ కాల్పుల్లో మరణించిన అమరులు విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ ల చిత్రపటాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచ బ్యాంక్ షరతుల్లో భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపుకు ఆనాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం పూనుకొందన్నారు. దానికి వ్యతిరేకంగా వాపక్షాలు చలో అసెంబ్లీ నిర్వహించాయన్నారు. అసెంబ్లీ వైపు దూసుకుపోతున్న ఆందోళనకారులపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. ముగ్గురు అమరులు పోరాటంలో అమరులయ్యారన్నారు. ఆ పోరాటం ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపిందన్నారు. ఫలితంగా తర్వాత వచ్చిన ఏ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీల పెంపుకు సాహసం చేయలేదన్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలు అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం, రైతులు కూలీలు శ్రామికుల సమస్యలు పెరిగాయి అన్నారు. విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు పి కళావతమ్మ, పృథ్వినాదం, రమణ, కాకం కాశన్న, కాశి, జయమ్మ, శిరీష,బిఆర్ఎస్ నాయకులు రాగి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : విద్యుత్ పోరాట అమరుల త్యాగం చిరస్మరణీయం : సిపిఐ)