Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ దివంగత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం

దివంగత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం

0

దివంగత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు /విజయనగరం :
పోలీసు సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందిన పోలీసు ఉద్యోగులు, దివంగత పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులు మరియు హోంగార్డు కుటుంబసభ్యులతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమావేశమై, వారి వ్యక్తిగత, ప్రభుత్వం నుండి ఇంకనూ రావల్సిన బకాయిలు, ఇతర రాయితీలు గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – ఉద్యోగ విరమణ పొందిన పోలీసు ఉద్యోగులు, సర్వీసులో ఉంటూ వివిధ కారణాలతో మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులతోను మరియు హోంగార్డు కుటుంబ సభ్యులతో మమేకమై, వారి యొక్క యోగ, క్షేమాలు, పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒకొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడి వారికి ప్రభుత్వం నుండి రావలసిని భద్రత, జిపిఎఫ్, ఎపిజిఎల్ఐ, చేయూత, విడో పండ్, కార్పస్ ఫండ్, అడిషినల్ కార్పస్ ఫండ్, గ్రూఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ నగదు వంటి ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు సకాలంలో అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఇంక ప్రభుత్వం నుండి బకాయి ఉన్న వాటి ప్రస్తుత స్థితిగతులను గురించి పోలీసు కార్యాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన వారి కుటుంబ సభ్యులకు అందే విధంగా చర్యలు చేపట్టాలని, కార్యాలయ ఉద్యోగులను ఆదేశించారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలు గురించి ఆరా తీసారు. పెండింగులో ఉన్న కారుణ్య నియామాకాలు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నది, ఏ కారణంగా పెండింగులో ఉన్నది కార్యాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. కొంత మంది పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం నుండి పెండింగులో ఉన్న జిఫిఎఫ్, గ్రూఫ్ ఇన్సూరెన్స్, ఎన్క్యాష్ మెంట్ లీవ్, ఫించను, కారుణ్య నియామకాలు గురించి రావలసి ఉన్నాయని, వాటిని సకాలంలో పరిష్కరించి, మంజూరయ్యే విధంగా చర్యలు చేపడతామన్న భరోసాను జిల్లా ఎస్పీ కల్పించారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉద్యోగులు, మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఏ అవసరమున్నా తమను సంప్రదించ వచ్చునని, ఎల్లవేళలా వారికి అండగా ఉంటామన భరోసాను కల్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఎ.వి. లీలారావు, మహిళా పీఎస్ సిఐ ఈ.నర్సింహమూర్తి, ఆర్ఐ ఎస్.గోపాల నాయుడు, ఆఫీసు సూపరింటెండెట్లు ప్రభాకరరావు, వెంకటలక్ష్మి, ఆర్ఎస్ఐలు ప్రసాదరావు, ఆలీ, పోలీసు అసోసియేషను రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, దివంగత పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులు, ఉద్యోగ విరమణ పొందిన పోలీసులు మరియు ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.(Story : దివంగత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version