ఆదివాసులు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం : ఆదివాసులు,ఆగిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలని, ఆర్థిక అభివృద్ధి సాధించాలని, విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, పథకాలను వినియోగించుకోవాలని, ఆదివాసుల,గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ అన్నారు. అడవిని నమ్ముకుని జీవించే నిర్మలమైన మనసు గల ఆదివాసుల,గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్త శుద్ధితో కృషి కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మూడు రోజుల పర్యటన లో భాగంగా ములుగు జిల్లా కు చేరుకున్నారు. గవర్నర్ ముందుగా యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్ మార్గంలో ములుగు జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. గవర్నర్ కు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు , జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర,ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ, తదితరులు పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో మహిళలు చిన్నారులు గవర్నర్ కు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ ఓ లు ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి కీ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.గవర్నర్ జిల్లా అభివృద్ధిపై ఆసక్తి చూపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తాను గవర్నర్ గా భాద్యతలు స్వీకరించిన, తొలిపర్యటనగా షెడ్యూల్ ప్రాంతమైన ములుగు జిల్లా ను ఎంచుకొని రావడం జరిగిందని పేర్కొన్నారు. తాను కుడా గతంలో పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రి గా పని చేసిన అనుభవం ఉంద న్నారు. ప్రభుత్వ పధకాలు బాగున్నాయని ప్రశంశించారు, పేదల అభ్యున్నతికి, గిరిజనులు ఆదివాసుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య ఆరోగ్య రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు ఆదివాసులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ స్ఫూర్తి కొనసాగాలని కోరారు. ఆధునిక సమాజంలో ఆదివాసులు గిరిజనులను భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయన్నారు. వీరికి అన్ని రకాలుగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వీరి కోసం.జిల్లా లో కంటైనర్ హాస్పిటల్ వినూత్నం గా ఏర్పాటు చేయడం పట్ల మంత్రి సీతక్క ను ప్రత్యేకంగా అభినందించారు. ఆదివాసీ, గిరిజన గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, మీరంతా అత్యుత్తమంగా విద్యను అభ్యసించి నవ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలనీ పేర్కొన్నారు. గిరిజనుల ఆదివాసులు ఆధునిక సమాజానికి అనుగుణంగా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో అన్ని రంగాల్లో ఆర్థికంగా పైకి రావాలని సూచించారు. ఇతర వర్గాలకు ఆదర్శంగా నిలువాలని ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ తొలి సారి జిల్లా పర్యటన కు గవర్నర్ రావడం పట్ల జిల్లా ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లా రాష్ట్రము లోనే అత్యధిక అటవీ విస్తరణo ఉన్నదని, 30 శాతం మంది ఆదివాసులు, గిరిజన ప్రజలు ఈ జిల్లా లో నివసిస్తన్నారని అన్నారు. ప్రజలు అంతా ఐకమత్యం తో నివసిస్తూ భిన్నత్వం లో ఏకత్వానికి ప్రతీక గా నిలుస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కీ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని తెలిపారు.ఆదివాసుల గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తున్నదని తెలిపారు. ఆసియా ఖండం లో అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం మహాజాతార ప్రతీ రెండు ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ జాతర జాతీయ పండుగ గా గుర్తించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గవర్నరు ను కోరారు. ములుగు జిల్లా చరిత్ర, పర్యాటక కేంద్రాలు, జిల్లా విశిష్టత, విశేషాలను గవర్నర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితం గా, మాతృ మరణాల రేట్, శిశు మరణాల రేటు తగ్గాయని పేర్కొన్నారు. మంత్రి ప్రత్యేక చొరవ తో గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాలను తగ్గించినట్లు తెలిపారు. సమ్మక్క, సారలమ్మ యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయని తెలిపారు. జిల్లా లో అడవులు సంరక్షణ కు అన్ని తీసుకొంటున్నామని, క్రైమ్ రేట్ తగ్గిందని పేర్కొన్నారు. ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ముందుకు పోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాను అన్ని రంగాల్లో ముందు ఉంచేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు..
మంత్రి సీతక్క గవర్నర్, ప్రిన్సిపాల్ సెక్రటరీల ను శాలువా తో సత్కరించారు. ఆదివాసీ చిత్రాలకు సంబంధించిన జ్ఞాపకాలను బహుకరించారు.అనంతరం
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర గవర్నర్ జిల్లాకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులలు (ప్రొఫెసర్ పాండురంగారావు) ఇన్ టాక్ , డాక్టర్ రాచర్ల గణపతి, (రచయిత) డాక్టర్ అంబటి శ్రీజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, చల్ల మౌనిక, (రెజ్లింగ్ క్రీడాకారిని,) పి రజిత, (జిమ్నాస్టిక్,) పాలడుగు వెంకటేశ్వరరావు, (వాలీబాల్ గోల్డ్ మెడలిస్ట్) కాజంపురం దామోదర్, (ఎన్విరాన్మెంట్ సైన్సిస్ట్) కొమరం ప్రభాకర్, (సోషల్ వర్కర్) నేషనల్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత, డాక్టర్ కొండల రామయ్య, (మ్యాథమెటిక్స్ టీచర్) తదితరులతో సమావేశం ఐయ్యారు. జిల్లా కు జాతీయ అంతర్జాతీయ స్థాయి లో పేరు ప్రాఖ్యతులు తీసుకురావడం పట్ల వారిని అభినందనలు తెలిపారు.
ప్రొఫెసర్ పాండు రంగా రావు రామప్ప దేవాలయం, నిర్మాణం, సాండ్ బాక్స్ టెక్నాలజీ, ఆలయ విశిష్టత వివరించారు. (Story : ఆదివాసులు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి)