సింగపూర్‌లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సీజన్ 2 బృందం
హైదరాబాద్: ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 బృందం ఈ సీరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న తరుణంలో సింగపూర్‌లో 3 ఆసక్తికరమైన రోజులు గడిపింది. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 ప్రైమ్ వీడియోపై ఆగస్ట్ 29న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మళయాళం, మరెన్నో భాషలలో 240 పైగా దేశాలలో ప్రీమియర్‌గా ప్రసారం అవుతుంది. ఈ సందర్భంగా నటీనటులు, నిర్మాణకర్తలు ఒక ప్రత్యేక ఆసియా పసిఫిక్ స్క్రీనింగ్ కొరకు సింగపూర్ వెళ్ళారు. తారాగణం అందరితో నిండిన ఈ ప్రీమియర్‌లో షో రన్నర్ జే.డి.పేన్, దర్శకుడు షార్లొట్ బ్రాండ్‌స్టార్మ్, చార్లీ వికర్స్, లాయడ్ ఓవెన్, మెగాన్ రిచర్డ్స్, మార్కెల్లా కావెనాఫ్‌ు, చార్ల్స్ ఎడ్వర్డ్స్, ఇస్మేల్ క్రుజ్ కార్డోవ, టైరో ముహాఫిదిన్, ట్రైస్టాన్ గ్రావెల్లెలతో సహా ప్రతిభ కలిగిన నటీనటులు అంతా హాజరు అయ్యారు. వారి యాత్ర సమయములో, ఈ బృందం ఒక ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరు అయ్యింది. ఇందులో జపాన్, థాయ్‌ల్యాండ్, ఇండోనేషియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, ఇండియా నుండి మీడియాతో పాటు ఫ్రాంచైస్, ఫాన్స్ కూడా పాల్గొన్నారు. ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఎస్‌ఈఏ, ఎంఈఎన్‌ఏ డైరెక్టర్, డేవిడ్ సైమాన్సెన్ ప్రారంభించారు. (Story : సింగపూర్‌లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సీజన్ 2 బృందం)