మానవత్వం చాటుకున్న పెంచికల్పేట్
ఎస్సై కొమురయ్య
న్యూస్‌తెలుగు/కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడ గ్రామ పంచాయతీపరిధిలోని కొత్వాల్ వాడ లో శనివారం రోజున గోగు.అంకుబాయి ఇల్లు భారీ వర్షానికి కూలి పోయిన సమాచారం తెలుసుకున్న ఎస్సై కొమురయ్య ప్రమాదం జరిగిన ఇంటినిపరిశీలించి,బాధితురాలు వివరాలుఅడిగి రూ”2000, 40 కిలోల బియ్యం, బ్యాంక్లెట్ లను బాధితురాలకు అందించి. మానవత్వం చాటుకున్నారు
ఈ సందర్భంగా ఎస్సై కొమురయ్య మాట్లాడుతూ కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాదం గా ఉన్న ఇండ్లలో ఉండొద్దని, వేరేచోట ఉండటానికి రేకులు ఇస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్సై. ప్రభాకర్ హెడ్ కానిస్టేబుల్ సారయ్య సామజిక కార్యకర్త చప్పిడి. ప్రకాశ్ చౌదరి.గుండయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : మానవత్వం చాటుకున్న పెంచికల్పేట్ )