Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గంజాయి కేసుల లింకుల చేధనలో పురోగతికి ప్రత్యేక బృందాలు

గంజాయి కేసుల లింకుల చేధనలో పురోగతికి ప్రత్యేక బృందాలు

0

గంజాయి కేసుల లింకుల చేధనలో పురోగతికి ప్రత్యేక బృందాలు

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.

న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లాలోని వివిధ పోలీసు స్టేషను పరిధిలో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసుల్లో నిందితుల లింకులను చేధించేందుకు, ఆయా కేసుల్లో మరింత పురోగతి సాధించేందుకు ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వారిని ఇతర రాష్ట్రాలకు పంపినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఇటీవల జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఆయా కేసుల్లో ఇంతవరకు చేపట్టిన దర్యాప్తు, సాధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. దర్యాప్తులో ఉన్న గంజాయి కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయా కేసులతో సంబంధం ఉన్న ఇతర నిందితుల లింకులను చేధించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గంజాయిని ఎక్కడ, ఎవరివద్ద నుండి కొనుగోలు చేసింది, కొనుగోలులో సహకరించిన వ్యక్తులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వ్యక్తుల వివరాలు, వారు ఎవరికి విక్రయాలు జరిపేది, ఎవరు వినియోగించేది అన్న వివరాలను రాబట్టాలన్నారు. ఇందులో భాగంగా ఐదుగురు ఎస్ఐలతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసామన్నారు. ఈ బృందాలు ఒడిస్సా, చత్తీస్ ఘడ్,ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్ళి, గంజాయి కేసులతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల సమాచారాన్ని రాబట్టనున్నారు. ఈ బృందాల గంజాయి కేసుల్లో ఇప్పటి వరకు సాధించిన సమాచారాన్ని మరింత విస్తృతం చేసి, ఆయా కేసులతో ప్రమేయం ఉన్న సూత్రధారులు, ఇతర నిందితులు లింకులను చేధించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్న వారిపై 22 గంజాయి కేసులు నమోదు చేసి, 65మంది నిందితులను అరెస్టు చేసామని తెలిపారు. వీరితోపాటు గంజాయిని సేవిస్తున్న మరో 35 మందిని, వారికి గంజాయిని తక్కువ మొత్తంలో విక్రయిస్తున్న 27మంది చిన్న వ్యాపారులను (పెడ్లర్స్) అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లుగా జిల్లా తెలిపారు. గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రంగా కఠిన చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా గతంలో బొడ్డవర వద్ద ఉన్న ఒక చెక్ పోస్టుకు అదనంగా మరో నాలుగు చెక్ పోస్టులను పాత బొబ్బిలి, పిట్టాడ, తుమ్మికాపల్లి, కొట్టక్కి వద్ద ఏర్పాటు చేసామన్నారు. వీటితోపాటు డైనమిక్ వాహన తనిఖీలను ఆకస్మికంగా, జిల్లా వ్యాప్తంగా వేరు వేరు ప్రాంతాల్లో చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. (Story : గంజాయి కేసుల లింకుల చేధనలో పురోగతికి ప్రత్యేక బృందాలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version