గుమ్మడి వృద్ధాశ్రమంలో ఘనంగా మదర్ తెరిసా జయంతి వేడుకలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక వెల్లటూరు రోడ్డు లోని గుమ్మడి వృద్ధాశ్రమం నందు మదర్ తెరిసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులందరూ మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మానవసేవే మాధవ సేవగా భావించి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటూ వృద్ధులను కంటికి రెప్పలుగా కాపాడుతున్న గుమ్మడి దంపతులకు మరియు వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి ఆశ్రమానికి సహాయ సహకారాలు అందజేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలిపారు. (Story : గుమ్మడి వృద్ధాశ్రమంలో ఘనంగా మదర్ తెరిసా జయంతి వేడుకలు.)