అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
కాంట్రాక్టు విధానం ,లేబర్ కోడ్ లను రద్దు కోసం ఏఐటీయూసీ పోరాటం
ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్
న్యూస్‌తెలుగు/విజయనగరం : సెప్టెంబర్ 1 2 3 తేదీలలో విశాఖపట్నంలో జరుగు ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలను జయప్రదం చేయాలని సోమవారం ఉదయం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ విజయనగరం డీసీఎంఎస్ కార్మికులతో కలిసి గోడ పత్రికలు, స్టిక్కర్లు విడుదల . చేశారు
ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ లోడింగ్ అన్లోడింగ్ పనులు, కాల్ గ్యాస్ డెలివరీ చేసే అసంఘటితరంగ కార్మికులకు పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ, పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనీ, ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజి, జె.ఎన్.టీ.యు, మున్సిపల్ క్లాప్ డ్రైవర్లుగా ఎలాంటి భద్రత లేకుండా బానిసలుగా పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం 26 పెంచి ఇవ్వాలని, కార్మికులను బానిసలుగా మార్చడానికి మోడీ తెచ్చిన 4 నల్ల లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ఆపాలని ఏఐటీయూసీ నిర్విరామ కార్మికవర్గ పోరాటాలు చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగిన ఏకైక జాతీయ కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమే అని తెలిపారు. భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని మొట్టమొదటిసారిగా నినదించిన కార్మిక సంఘం అని తెలిపారు. స్వాతంత్ర అనంతరం దేశంలో ఫ్యాక్టరీ కార్మికులకు, ఉద్యోగులకు, అసంఘటిత రంగంలో కార్మికులకు యూనియన్లను పెట్టే అనేక కార్మిక చట్టాలను సౌకర్యాలను హక్కులను సాధించిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ 104 ఏళ్ళు కార్మికవర్గ పోరాటాల చరిత్ర కలిగిన ఉందని నేడు కార్మికవర్గం అంతా ఎఐటియుసి జెండాను వారి భుజాన వేసుకుని వారి హక్కుల సాధన కోసం, ఎందరో కార్మికుల ప్రాణత్యాగాలుతో వచ్చిన చట్టాలను పరిరక్షించుకుంటూ ముందుకు సాగుతున్నారు అని తెలిపారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక నాలుగు కార్మిక కోడ్ లను రద్దు చేయాలని. 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటికరణను ఆపాలని విశాఖ ఉక్కు పరిశ్రమలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, స్కీం వర్కర్లు ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజన పథకం, స్కూలు ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని భవిష్యత్తు కార్మికు ఉద్యమం నిర్ణయాలు జరుగుతాయని అన్నారు. ఈ సమావేశాలకు దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు అని తెలిపారు. సెప్టెంబర్ 3 వ తేదీన సుమారు లక్ష మందితో విశాఖలో భారీ కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుంది అని తెలిపారు. 3 వ తేదీన జరుగు కార్మిక మహా ప్రదర్శనకి విజయనగరం జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉద్యోగులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బుగత అశోక్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చందక శ్రీను, చందక రామకృష్ణ, మజ్జి రమణ మరియు కార్మికులు పాల్గొన్నారు. (Story : అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి)