ఎవరికి భయపడకండి?
వాస్తవాలు వెలికి తీయండి..నిజాలు నెగ్గు తేల్చండి
మంత్రి సారథి ఆదేశం
న్యూస్ తెలుగు /చాట్రాయి : మాజీ ఎంపీపీ కందుల కృష్ణ కూతురు జయలక్ష్మి అనుమానాస్పద మృతిపై వాస్తవాలను వెలికి తీయాలని నిజాలని నెగ్గితేల్చాలని ఎవరికీ భయపడవద్దని మంత్రి కొలుసు పార్థసారథి చాట్రాయి ఆదేశించినట్లు తెలిసింది. ఏప్రిల్ ఆరో తేదీన చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కందుల కృష్ణ కూతురు జయలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా అప్పట్లో చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సరిగా పట్టించుకోకపోవడంతో కందుల కృష్ణ జిల్లా పోలీసు అధికారులను రాష్ట్రస్థాయి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉన్నతాధికారులను రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, హోం శాఖ మంత్రి అనితను కలిసి తన గోడు వెళ్ళబుచ్చుకోవడంతో గత నాలుగు రోజుల క్రితం జిల్లా ఎస్పీ ఆదేశాలతో విచారణ ప్రారంభమైంది. విచారణలో చాట్రా యి ఎస్సై కి తాసిల్దార్ కి మధ్య వాదోపవాదలు జరిగిన విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆగ్రహించిన మంత్రి సారధి తాసిల్దార్ కి ఫోన్ చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదల వద్దని ఎవరికి భయపడ వద్దని బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఆడపిల్లల కేసులు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. (Story : ఎవరికి భయపడకండి?)