యూఎస్ వర్శిటీల ప్రతినిధులతో మొజాయిక్ సమావేశం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: 450కు పైగా యుఎస్ విశ్వవిద్యాలయాలు, 900కు పైగా ప్రముఖ ప్రపంచ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాసియాలోని అతిపెద్ద విద్యార్థుల నియామక సంస్థ కెరీర్ మొజాయిక్ హైదరాబాద్‌లో 25 యుఎస్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించింది. కొత్త కోర్సులు, స్కాలర్‌షిప్‌లు, తదితర అంశాలను పంచుకోవడంపై ఈ విశ్వవిద్యాలయాలు దృష్టి సారించి, కళాశాల క్యాంపస్‌లలోని విద్యార్థులు, కళాశాల సలహాదారులు, ఆంధ్రప్రదేశ్ (ఏపీ), తెలంగాణ నుండి స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్‌లతో సమావేశమయ్యాయి. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా పెంబ్రోక్, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ లాంగ్ బీచ్, యూనివర్శిటీ ఆఫ్ నెవాడా-లాస్ వెగాస్, యూనివర్శిటీ ఆఫ్ మెంఫిస్, యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్-ఫ్లింట్, శాన్-జోస్ స్టేట్ యూనివర్శిటీ, సెంట్రల్ మిచిగాన్ యూనివర్శిటీ, మిడిల్ టెనెస్సీ స్టేట్ , వర్జీనియా కామన్వెల్త్ విశ్వవిద్యాలయం, వెబ్‌స్టర్ విశ్వవిద్యాలయం, మరెన్నో విశ్వవిద్యాలయాల ప్రతినిధులు రావటంతో పాటుగా విద్యార్థులు, స్టడీ అబ్రాడ్ కమ్యూనిటీతో చర్చించారు. (Story : యూఎస్ వర్శిటీల ప్రతినిధులతో మొజాయిక్ సమావేశం)