గంగపుత్రుల క్యాండిల్ శాంతిర్యాలీ!
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ః బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సబ్జీ మండి గంగపుత్ర సంఘం పిలుపుమేరకు గంగపుత్రులు, మహిళలు, యువకులు, విద్యార్థులు శాంతియుత క్యాండిల్ ర్యాలీ సాయంత్రం 6:00 నుండి రాతిరి 9 గంటల వరకు సబ్జీ మండి గంగపుత్ర సంఘం శ్రీ గంగా పరమేశ్వరి దేవాలయం నుండి పురానాపూల్ చౌరస్తా వరకు జాతీయ జెండాలతో, ఫ్లక్ కార్డులతో ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్ లో హిందువులు, హిందూ ఆలయాలను ధ్వంసం చేయడాని వ్యతిరేకిస్తూ హిందువులందరూ జాగృతం కావాలని, బంగ్లాదేశ్ యందు హిందువుల ఆస్తులు, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని మతోన్మాదులు దాడులు చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామని సబ్జీ మండి గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఆనందేసి విజయ్ కిషోర్ గారు తెలిపినారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఆనందేశి వేణుబాబు, గూడబోయిన శివరత్నం, గాండ్ల నిరంజన్ బాబు, గుడుమని అశోక్ కుమార్, రాస్కాస్ భగవాన్,కట్ట నర్సింగరావు, దొర్తుల శ్రీనివాస్, గంగపుత్ర మహిళా సంఘం అధ్యక్షులు కుడుముల స్వాతి, లావణ్య, కుడుముల రేఖ, చేర్క్ రాజశ్రీ గంగపుత్ర యువజన సంఘం అధ్యక్షులు నాస వినయ్, సంఘ సభ్యులు, మహిళా సభ్యులు, నవ యువకులు, విద్యార్థులు 500 మంది పాల్గొన్నారు. (Story : గంగపుత్రుల క్యాండిల్ శాంతిర్యాలీ!)