‘తెలుసు కదా’ షూటింగ్ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ న్యూ మూవీ ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై టాకీతో పాటు సాంగ్ ని షూట్ చేశారు.
తాజాగా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ కొత్త షెడ్యూల్ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో చాలా కీలకమైన సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.
నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష (Story : ‘తెలుసు కదా’ షూటింగ్ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి)