UA-35385725-1 UA-35385725-1

దివ్యాంగులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

దివ్యాంగులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

న్యూస్‌తెలుగు/ ములుగు : దివ్యాంగులకు చేయూతనివ్వడం మనందరి బాధ్యత అని, 22న పస్రా, 23 న ఏటూరునాగారం ల లో నిర్వహించే శిబిరాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలనీ, జి ల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అన్నారు. బుదవారం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఆలీంకో హైదరాబాదు వారి సహకారంతో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు సహాయ ఉపకరాణాల గుర్తింపు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రారంభించారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. హాజరై మాట్లాడుతూ ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట ప్రాంతాలకు చెందిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందించుట కొరకు అవసరమైనటువంటి సహాయ ఉపకరణాలను గుర్తించేటకై శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దివ్యాంగులు దూర ప్రాంతాల నుండి రావడం వారికి ఇబ్బంది అవుతుందని వారి సౌకర్యార్థమై రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జిల్లాలో ప్రత్యేకంగా మూడు క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని, ములుగు, పస్రా, ఏటూరునాగారం ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇట్టి శిబిరాలను ఉపయోగించుకొని దివ్యాంగులు అందరూ హాజరై వారికి అవసరమైనటువంటి సహాయ ఉపకరణాలను పొందాలని తెలిపారు. దివ్యాంగులకు సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరూ అధికారులు బాధ్యతగా తీసుకొని దివ్యాంగులకు అవసరమైనటువంటి పరికరాలను గుర్తించి ఆలెంకో సంస్థ ద్వారా వారికి అందివ్వడం జరుగుతుందని అన్నారు. ఈ శిబిరం ద్వారా వివిధ రకాలైన దివ్యాంగులకు వారికి అవసరమైనటువంటి పలురకాల సహాయ ఉపకరణాలను గుర్తించడం జరుగుతుందని, ఇట్టి గుర్తించిన సహాయ ఉపకరణాలను అలింకో హైదరాబాద్ వారి సహకారంతో లబ్ధిదారులందరికీ మరొక శిబిరం ద్వారా అందివ్వడం జరుగుతుందని తెలిపారు.
ఈ శిబిరానికి వివిధ గ్రామాల నుండి దివ్యాంగులను తీసుకొని వచ్చినటువంటి మహిళా అభివృద్ధి శాఖ అధికారులు, సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్లను మరియు డిఆర్డిఏ శాఖ నుండి అధికారులందరినీ కలెక్టర్ అభినందించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనిన మాట్లాడుతూ ఈ శిబిరానికి ములుగు వెంకటాపూర్ గోవిందరావుపేట మండలాల నుండి దివ్యాంగులను సమీకరించడానికి సహకరించినటువంటి అధికారులకు దివ్యాంగుల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలీంకో సంస్థ ప్రతినిధి ఆశిష్ మాట్లాడుతూ దివ్యాంగులు 40 శాతం దివంగత్వం పైబడినటువంటి వారికి మరియు 80% దివ్యాంగత్వం పైబడినటువంటి వారికి ఇలా ప్రత్యేకంగా గుర్తించి వారి వారి అవసరాలను బట్టి వారికి రకరకాల సహాయ ఉపకరణాలను నిర్ణయించి అందివ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈరోజు శిబిరానికి హాజరు కానటువంటి దివ్యాంగులు గురువారం పస్రా లో, శుక్రవారం ఏటూరు నాగారంలో జరగబోయే క్యాంపులలో ఈ రోజు హజరు కానీ వారు హాజరై సద్వినియోగం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సంపత్ రావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రవీందర్ రెడ్డి, ప్రియనేస్తం ఫౌండేషన్ పి.నాగరాజు, ములుగు ఎంపీడీవో, ములుగు జిల్లా బాలల పరిరక్షణ అధికారి జె.ఓంకార్, అలీమ్ కో సంస్థ ప్రతినిధులు, స్థానిక సిడిపిఓ శిరీష, సూపర్వైజర్లు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది & జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : దివ్యాంగులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1