బెటాలియన్ లో అడిషనల్ డీజీపీ పర్యటన
ములుగు /తెలుగు న్యూస్ : గోవిందారావుపేట మండలంలోని చల్వాయి 5వ బెటాలియన్ లో, తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీపీ శ్రీ సంజయ్ కుమార్ జైన్ సందర్శించి, బెటాలియన్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కమాండంట్ అలెక్స్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బెటాలియన్ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు కేటాయింపులలో, పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయుటకు తనవంతు కృషి చేస్తానని, సిబ్బంది సంక్షేమానికి కావాల్సిన ప్రపోజల్స్ పంపిస్తే, నిధులు సంక్షేమ నిధి నుండి వెంటనే మంజూరి చేస్తానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ శభరీష్, ఓఎస్డి జి.మహేష్ బాబా సాహెబ్ అడిషనల్ కమాండంట్ ఎన్.పెద్ద బాబు, అసిస్టెంట్ కమాండంట్ అనిల్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, ములుగు డిఎస్పీ రవీందర్, ఆర్ఐ జి.కార్తీక్, శ్రీనివాసచారీ, అన్నయ్య, రాంప్రసాద్ ఆర్ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : బెటాలియన్ లో అడిషనల్ డీజీపీ పర్యటన )