UA-35385725-1 UA-35385725-1

గంజాయి ప్యాకింగులు చేసి, ఢిల్లీకి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు

గంజాయి ప్యాకింగులు చేసి, ఢిల్లీకి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు / విజయనగరం : విజయనగరం మండలం ధర్మపురి పరిధిలోని వసంత విహార్ లే అవుట్ లో ఒక విల్లాను అద్దెకు తీసుకొని, గంజాయిని వేరు వేరు ప్రాంతాలకు రవాణ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరాలను వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాకు చెందిన (ఎ-1) మహ్మద్ వసీం (34 సం.లు) అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంకు అక్కడ నుండి సుమారు సంవత్సరంన్నర క్రితం విజయనగరంకు వలస వచ్చి, శివారు ప్రాంతాల్లో ఇల్లులు అద్దెకు తీసుకొని, ఒడిస్సా మరియు ఇతర ప్రాంతాల నుండి గంజాయిని తీసుకొని వచ్చి, అద్దెకు తీసుకున్న ఇంటిలో చిన్న చిన్న పేకెట్లు చేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా రూరల్ పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. ఈ సమాచారం మేరకు భోగాపురం సిఐ,విజయనగరం రూరల్ ఇన్చార్జ్ సిఐ జి. రామకృష్ణ ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు రైడ్ చేసి, సదరు ఇంటిలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 22.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. (ఎ-2) బీహార్ రాష్ట్రం కిషాన్ గంజ్ జిల్లా అల్తవాడ గ్రామానికి చెందిన ఇన్ఫోజ్ అలం (29సం.లు) (ఎ-3) ఢిల్లీ, జామియా నగర్ కు చెందిన రుక్వాయి కుర్షీద్ (35 సం.లు) అనే మహిళ ఉన్నట్లుగా తెలిపారు. (ఎ-2) ఇన్ఫోజ్ అలం (ఎ-3) రుక్వాయి కుర్షిద్ గంజాయిని ఢిల్లీ తీసుకొని వెళ్ళేందుకుగాను విజయనగరం వచ్చినట్లుగా విచారణలో వెల్లడైందన్నారు. ఈ రైడ్లో 22,7 కిలోల గంజాయి, గంజాయిని ప్యాకింగు చేసేందుకు వినియోగించే ప్యాకింగు టేపులు, బ్రౌన్ కలర్ షీట్స్, కత్తెర, ప్యాకింగు త్రాడు, వేయింగ్ మెషిన్, ట్రాలీ బ్యాగులు, గంజాయి వాసన రాకుండా వినియోగించే కంఫర్ట్ చిక్విడ్, అగరబత్తులను సీజ్ చేసామన్నారు.

(ఎ-1) మహ్మద్ వసీం ఢిల్లీకి చెందిన మహ్మద్ కబీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో గంజాయి వ్యాపారం చేసేందుకు నిర్ణయించుకొని, గంజాయిని ఒడిస్సా నుండి ఆంధ్రాకు, అక్కడ నుండి ఢిల్లీకి పథకం ప్రకారం తరలిస్తున్నారన్నారు. ఒడిస్సా మరియు ఇతర ప్రాంతాల నుండి ఎక్కువ మొత్తంలో విజయనగరం తీసుకొని వచ్చిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి, ఢిల్లీ తరలించి ఎక్కువ డబ్బులకు విక్రయించాలని నిర్ణయించారన్నారు. ఇందుకుగాను గంజాయిని అరకు ప్రాంతానికి చెందిన మజ్జి విశ్వనాధం , అతని భార్య గంగమ్మ ఒడిస్సా నుండి గంజాయిని కొనుగోలు చేసి, విజయనగరంలో ఉన్న (ఎ-1) మహ్మద్ వసీంకు కిలో రూ.3,500/-లకు విక్రయించేటట్లుగా ఒప్పందం కుదుర్చుకొన్నారన్నారు. గంజాయిని అరకు నుండి విజయనగరంకు రవాణ చేసేందుకు గోపి, అర్జున్ అనే నలుగురు వ్యక్తులు సహకరించేవారన్నారు. ఈ నలుగురు వ్యక్తులు విజయనగరంలో ఉంటున్న (ఎ-1) మహ్మద్ వసీంకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. విజయనగరంలోని (ఎ-1) వసీం వద్ద నుండి గంజాయిని ఢిల్లీ తరలించేందుకు కబీర్ వేరు వేరు వ్యక్తులను వినియోగించేవాడని, గంజాయి తరలించేందుకు గాను వారికి రూ.10వేలు రూపాయలను కబీర్ చెల్లించేవారని, వీటికి అదనంగా ట్రాన్స్పోర్టు, భోజనం ఖర్చులకు గాను మరికొంత సొమ్మును ఇచ్చేవారన్నారు. (ఎ-1) వసీంకు కిలో గంజాయికి ప్యాకింగులు చేసి, ఢిల్లీకి రవాణ చేసేందుకుగాను రూ. 1500/- లను ఢిల్లీ చెందిన కబీర్ చెల్లించేవాడన్నారు. ఈ నగదు చెల్లింపులను క్యాష్ డిపాజిట్ మెషిన్స్ (సి.డి.ఎం.)ల ద్వారా గంజాయి వ్యాపారంలో భాగస్వాములకు ముట్టజెప్పేవారన్నారు. గతంలో కూడా కబీర్, పసీంలు విజయనగరం పట్టణం బ్యాంకు కాలనీలో ఒక ఇల్లును అద్దెకు తీసుకొని, ఇదే తరహాలో గంజాయి వ్యాపారం చేసేవారన్నారు. ప్రస్తుతం ఈ కేసులో (ఎ-1) మహ్మద్ వసీం (ఎ-2) ఇన్ఫోజ్ అలం (ఎ-3) రుకాయి కుర్షిద్ ను అరెస్టు చేసామన్నారు. వీరితోపాటు ఢిల్లీ నుండి గంజాయి వ్యాపారం చేస్తున్న మహ్మద్ కబీరు, గంజాయిని సరఫరా చేసిన అరకు వ్యాలీకి చెందిన మజ్జి విశ్వనాధం, అతని భార్య మజ్జి గంగమ్మలను, ఒడిస్సా, అరకు వ్యాలీ నుండి విజయనగరంకు గంజాయిని రవాణ చేసిన గొల్లూరి అనీల్, గోవింద్, గోపి, అర్జున్ లను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు, ఇతర రాష్ట్రాల వ్యక్తులకు తమ ఇల్లులను అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్వాపరాలు ముందుగా తెలుసుకోవాలని, వారు ఇంటిని ఎందుకు వినియోగిస్తున్నది పూర్తిగా తెలుసుకున్న తరువాతనే ఇల్లులను అద్దెకు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

ఈ సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సి ఐ జి. రామకృష్ణ, ఎస్బి సిఐ కే.కే.వి. విజయనాథ్, రూరల్ ఎస్ఐలు ఆర్. వాసుదేవ్, శ్యామల ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : గంజాయి ప్యాకింగులు చేసి, ఢిల్లీకి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1