ప్రాంతీయ కేపీఓపీ విజేతను ప్రకటించిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్
న్యూస్‌తెలుగు / హైదరాబాద్: భారతదేశంలో, ఎల్‌జీ ఎలక్ట్రోనిక్స్, ప్రముఖ వినియోగదారు డ్యూరబుల్ బ్రాండ్ హైదరాబాద్‌లో జరిగిన తమ ఆల్ – ఇండియా కేపీఓపీ (కేపాప్) పోటీ 2024 ప్రాంతీయ రౌండ్ విజేతలను ప్రకటించింది. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా. సహకారంలో హైదరాబాద్ ప్రాంతం కోసం నిర్వహించిన ఆన్ లైన్ ఆడిషన్స నుండి విజేతలు ఎంపికయ్యారు. హైదరాబాద్ ప్రాంతంలోని విజేతలు షైలీ ప్రీతమ్ వోకల్స్ శ్రేణిలో, డాన్స్ శ్రేణిలో సెజల్ దుబేలు తమ వినసొంపైన స్వర మాధుర్యంతో, శక్తివంతమైన డాన్య్ మూవ్స్ కు తమ అసాధారణ ప్రతిభను కలిపి, కేపీఓపీ శైలికి లోతైన సంబంధంతో న్యామూర్తులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎల్జీ ఎలక్ట్రోనిక్స్ ఇండియా కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా సహకారంతో తమ ‘ఆల్ ఇండియా కేపీఓపీ పోటీ 2024’ 3వ ఎడిషన్‌ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా కొరియన్ పాప్ సంస్క్రతికి అంకితమైన అభిమానులను గుర్తంచే లక్ష్యాన్ని కలిగి ఉంది. పోటీ కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ రౌండ్ కు 10,500 రిజిస్ట్రేషన్స పూర్తయి అనూహ్యమైన ప్రతిస్పందన వచ్చింది. ప్రాంతీయ ప్రిలిమనరీస్ భారతదేశంలో జులై 27 నుండి సెప్టెంబర్ 1 వరకు 11 ప్రాంతాలలో జరిగాయి. విజేతలు ఢల్లీిలో జరిగే సెమీ ఫైనల్స్ లో పాల్గొంటారు.(Story:ప్రాంతీయ కేపీఓపీ విజేతను ప్రకటించిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్)