కూటమి ప్రభుత్వ సంకల్పానికి ప్రకృతి కూడా సహకరిస్తోంది
శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే జీవీ, మక్కెన
న్యూస్‌తెలుగు / వినుకొండ : రాష్ట్రంలో ప్రతిచేనుకు నీరు, ప్రతిచేతికి పని అనే లక్ష్యాన్ని నిర్థేశించుకున్న కూటమి ప్రభుత్వం సంకల్పానికి ప్రకృతి కూడా సహకరిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. చంద్రబాబు వస్తే వానలు పడవన్న వైకాపా తప్పుడు ప్రచారాలకు జోరు వానలో వరుణుడే సమాధానం చెబుతున్నట్లు కనిస్తోందన్నారు. స్వల్పవ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయ ని, పల్లెసీమలన్నీ పచ్చ తోరణంగా మారడం సంతోషంగా అనిపిస్తోందన్నారు. వినుకొండ శ్రీనివాస నగర్ లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ 38వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో జీవీ ఆంజనేయులు, మక్కెన పాల్గొన్నారు. వేంకటేశ్వరస్వామికి జీవీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారిద్దరికి వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూతెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయని, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలన్ని పూర్తిగా నిండాయన్నారు. భగవంతుడు దయతో ఈ ఏడాది పాడి పంటలు బాగా పండి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ వేంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన యజ్ఞ యాగాలు, అన్నసమారాధన, చివరిరోజు పూర్ణాహుతి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయని ఆలయ కమిటీ నిర్వాహకులను అభినందించారు. అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వినుకొండ పట్టణంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు జీవీ ఆంజనేయులుకు శ్రీవారి దివ్యాశీస్సులు ఉండాలన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. జీవీ ఆంజనేయులు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా లభించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్దు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొణిజేటి నాగ శ్రీను రాయల్ పాల్గొన్నారు. (Story : కూటమి ప్రభుత్వ సంకల్పానికి ప్రకృతి కూడా సహకరిస్తోంది)