తెలుగింటి ఆడపడుచులకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేసిన రావుల
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాఖీ పండుగ సందర్భంగా సోదరి విజయలక్ష్మి రావుల చంద్రశేఖరరెడ్డి గారికి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ అన్నకు చెల్లిరక్ష చెల్లికి అన్నరక్ష అని సమాజములో ఎన్నో వ్యవహారిక బంధాలు ఉన్న అత్యంత అనుబంధం తోబుట్టువులది అని అనుక్షణం సోదరుల సంక్షేమం కోరుకునేది మాత్రం అక్కాచెల్లెళ్ళు మాత్రమే అన్నారు. యాంత్రిక జీవితంలో అనుబంధాలు, ఆత్మీయతలు కరువు అవుతున్న ఈరోజుల్లో బావి తరాలకు వ్యవహారిక,సంప్రదాయ,ఆత్మీయ పలకరింపులు నేర్పించాల్సిన బాధ్యత మరవొద్దని అన్నారు. సిరిసంపదలు తాత్కాలికమేనని అనుబంధాలు ఆత్మీయతలు మాత్రమే శాశ్వతం అని అన్నారు.మనవెంట వచ్చేవి మంచి చెడు మాత్రమే అని గుర్తెరిగిన నాడు మానవ మనుగడకు సార్థకత చేకూరుతుంది అని మనం చూపిన ఆత్మీయత,చేసిన పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి అని అన్నారు.
మరోసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : తెలుగింటి ఆడపడుచులకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేసిన రావుల)