ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించడం పై దృష్టి సారించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించడం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఐ.డి. ఓ.సి ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్ తో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 18 ఫిర్యాదులు వచ్చాయి.
అనంతరం కలక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటంలో వేగం పెంచాలని సూచించారు. ఆయా శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను అధికారులకు గుర్తు చేశారు. వచ్చే ప్రజావాణి లోగా ఇప్పుడు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించడం పై దృష్టి సారించాలి)