జాతీయ ప్రధాన రహదారిపై రోడ్లపై గుంతలు పూడ్చివేత
ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్
న్యూస్‌తెలుగు / ఏటూరు నాగారం : మండలంలోని చిన్నబోయినపల్లి 163వ జాతీయ ప్రధాన రహదారి పై ప్రమాదకరంగా మారిన గుంతలను సోమవారం ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ స్వయంగా గుంతలు పూడ్చి వేయడం జరిగింది. ఎస్సై స్వయంగా గుంతలు పూడ్చివేస్తుండడంతో ప్రధాన రహదారి మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు పోలీసుల సేవలను కొనియాడుతూ శభాష్ పోలీస్ అంటూ అభినందించారు. ఈ మార్గం లో ప్రధాన రహదారిపై గతంలో గుంత లు ఏర్పడడంతో రాత్రిపూట ప్రయాణించే వాహనాలు ప్రమాదకరంగా మారిన గుంతలను గమనించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు నేలకొన్నాయి ఉన్నాయి. వాహన దారులు అతి వేగంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని. రోడ్లపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను గమనించి నిదానంగా వెళ్లాలని . వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : జాతీయ ప్రధాన రహదారిపై రోడ్లపై గుంతలు పూడ్చివేత)