Home వార్తలు తెలంగాణ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి నిజాలను నిగ్గు తేల్చాలి : సిపిఐ

జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి నిజాలను నిగ్గు తేల్చాలి : సిపిఐ

0

జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి నిజాలను

నిగ్గు తేల్చాలి : సిపిఐ

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఆదానీ కంపెనీల్లో సెబీ చైర్మన్ రూ. 20 వేల కోట్ల పెట్టుబడులపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి నిజాలను నిగ్గు తేల్చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బాల నరసింహ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రం యాదవ భవన్ లో శ్రీహరి అధ్యక్షతన జరిగిన సిపిఐ వనపర్తి జిల్లా నిర్మాణ విస్తృత కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోకి ఓడరేవుల ద్వారా హెరాయిన్,కొకైన్ సరఫరా పెరిగిందని, ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. హెరాయిన్,కొకైన్ తో యువత నిర్వీర్యం అవుతోందన్నారు. కోల్కత్తాలో ట్రైన్ డాక్టర్ పై హత్యాచారం నేపథ్యంలో మహిళల రక్షణకు సమాజంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ మహిళలపై, మైనర్ బాలికలపై అత్యాచారాలు హత్యలు తగ్గటం లేదన్నారు. సమాజంలో చైతన్య ఇచ్చేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ గందరగోళంగా మారిందన్నారు. బ్యాంకులు, సింగిల్ విండోన్లో అర్హులైన చాలామందికి రుణమాఫీ కాలేదని ఆవేదనతో రోడ్ ఎక్కుతున్నారన్నారు. పాస్ బుక్కు, ఆధార్ బుక్కులు కాకుండా రైతుల అప్పు ఖాతాలను ప్రామాణికంగా తీసుకొని రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని కోరారు. రైతు భరోసా పై కాలయాపన జరుగుతోందన్నారు. ఖరీఫ్ సీజన్ నెల రోజులే ఉందని రైతు ఏకాభిప్రాయం పేరుతో రైతు భరోసా పై కాలయాపన తగదన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించారన్నారు. గ్రామాల్లో అఖిలపక్ష కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు. భూ సమస్యలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని, సత్వర పరిష్కార మార్గాలను కనుగొనాలన్నారు. గ్రామాలను ప్రజా సమస్యలను గుర్తించి పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్త గ్రామాలకు పార్టీని విస్తరించాలని కోరారు. కౌన్సిల్ సమావేశానికి ముందు బాల నరసింహ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కౌన్సిల్ సమావేశానికి ముందు కలకత్తాలో మృతి చెందిన ట్రైనీ డాక్టర్ , ఇటీవల మృతి చెందిన సిపిఐ నాయకుల కు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. ఇప్పటివరకు పార్టీ జిల్లాలో చేసిన పోరాటాలను సాధించిన ఫలితాలను వివరించారు, పార్టీని ప్రజాసంఘాలను విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ,జె. చంద్రయ్య, అబ్రహం, రమేష్, శ్రీహరి, గోపాలకృష్ణ, మోష, భాస్కర్ వేదికల అలంకరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సురేష్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి గీత, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, సిపిఐ నాయకులు సీ.ఎన్ శెట్టి, శివ, శిరీష,కాకం బాలస్వామి, ప్రజానాట్యమండలి గాయకుడు శ్యామల, ఎర్రన్న, గోపాల్, కుర్మయ్య, తదితరులు పాల్గొన్నారు. (Story : జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి నిజాలను నిగ్గు తేల్చాలి : సిపిఐ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version