రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం..
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిద్దాం
డా.గోదా జాన్ పాల్ రాష్ట్ర అధ్యక్షులు మాల మహానాడు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షులు డా.గోదా జాన్ పాల్ పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ పై తీర్పును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో 21 న ప్రకటించిన భారత్ బంద్ ని మాల మహానాడు రాష్ట్ర కమిటీ స్వాగతిస్తూ పల్నాడు జిల్లా వినుకొండలో వ్యాపార సంస్థలు విద్యాసంస్థలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో యస్సి, ఎస్టీ ల రిజర్వేషన్ ఎత్తివేసే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం తీసుకుందని దానిలో భాగమే క్రిమిలేయర్ అంశం, దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ నుండి బీఎస్పీ అధినేత బెహన్జీ మాయావతి తో పాటు పలు మేధావుల ప్రకటనను స్వాగతిస్తూ గ్రామస్థాయి నుండి మాలలు విద్యార్థులు ఉద్యోగులు కదలి రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ, పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం దళిత గిరిజనుల వర్గాలకు కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే పార్లమెంట్లో రిజర్వేషన్ పెంచే ఆలోచన చేయాలని అలా కాకుండా ఉన్న రిజర్వేషన్లు విభజించి దళితులను వర్గాలుగా విభజించాలని చూస్తే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ కి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తూ 21 భారత్ బంద్ ని ప్రతి ఒక్కరూ కలసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్, కార్యదర్శి రాయన చిన్న, వినుకొండ నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు కొట్టే వెంకట్రావు, గౌరవాధ్యక్షులు కొమ్మతోటి కృప, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు కనమాల అంకరావు, పట్టణ అధ్యక్షులు బేతం దేవానంద్, మండల అధ్యక్షులు పిడతల అనిల్ , ఈపూరు మండల అధ్యక్షులు పెనుమాల వెంకట్రావు, నూజెండ్ల మండల అధ్యక్షులు అందుకూరు గురుమూర్తి, శావల్య పురం మండలం మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, జ్యోతి, మల్లికార్జున్ ,కొమ్మ తోటి సుధాకర్ ,కీర్తి పాటి గోవిందరాజులు, పిడతల నారాయణ, బిల్లా ఇశ్రాయేలు, డోలా కరుణ, పల్లపాటి భాస్కర్,జొన్నలగడ్డ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. (Story : రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం..)