‘మైల్స్ ఆఫ్ స్మైల్స్’ పుస్తకం విడుదల
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: డాక్టర్ ఎంఎస్ గౌడ్ రచించిన ‘మైల్స్ ఆఫ్ స్మైల్స్’ పుస్తకాన్ని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాజ్ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ‘ఈ పుస్తకం చూశాను, ఆయన కృషికి నా అభినందనలు. ఒక దంత వైద్యుడిగా తన ప్రయాణంలో ఎన్నో చేశారు. తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా అత్యుత్తమ దంత వైద్యుడిగా గుర్తింపు పొందారు. పాఠకులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పడమే మంచి రచయిత తాలూకా నైపుణ్యం దాగి ఉంటుందని’ తెలిపారు. రచయిత డాక్టర్ ఎంఎస్ గౌడ్ మాట్లాడుతూ ఈ పుస్తకం నా ఆత్మకథ కాదన్నారు. ఈ పుస్తకం ఒక సాధారణ దంత వైద్యుడి నిజమైన కల అన్నారు. ఈ పుస్తకం సహకారం, ప్రయత్నాల గురించి మాట్లాడుతుందన్నారు. గతంలో చేసిన కఠోర శ్రమ వల్లే ఈ రోజు నేనుగా ఉన్నానన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాస్మెటిక్ డెంటిస్ట్రీని ప్రవేశపెట్టిన మొదటి డెంటిస్ట్ డాక్టర్ నేనేనన్నారు. దంత వైద్యం, దంత వృత్తి ఇమేజ్‌ని నిర్మించడంలో దశాబ్దాలుగా కృషి చేశానన్నారు. (Story : ‘మైల్స్ ఆఫ్ స్మైల్స్’ పుస్తకం విడుదల )