క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ సమావేశం ప్రారంభం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: అంటువ్యాధుల పట్ల అప్రమత్తత అవసరమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) ప్రొఫెసర్ (డాక్టర్) అతుల్ గోయెల్ తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్) 14వ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. గౌరవ అతిథిగా అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతుల్ గోయెల్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్) అధ్యక్షుడు డాక్టర్ జార్జ్ ఎం వర్గీస్, సిడ్‌స్కాన్ 2024 ఆర్గనైజింగ్ చైర్ డాక్టర్ సునీత నర్రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చే రెండు క్లిష్టమైన సవాళ్లు ఉన్నాయన్నారు. అవి యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్), ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్లు అన్నారు. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ నిశ్శబ్ద మహమ్మారిగా కొనసాగుతుందని తెలిపారు. (Story : క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ సమావేశం ప్రారంభం)