Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఎట్టకేలకు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు జోగి రమేష్‌

ఎట్టకేలకు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు జోగి రమేష్‌

0

ఎట్టకేలకు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు జోగి రమేష్‌

న్యూస్ తెలుగు/అమరావతి: మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్‌ ఎట్టకేలకు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి నిరసన ప్రదర్శనగా వెళ్లగా, ఆయనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేశారనే ఆరోపణలపై జోగి రమేశ్‌పై కేసు నమోదైంది. దాని నిమిత్తం మంగళగిరి పోలీసులు ఇటీవల ఆయనకు నోటీసులు జారీజేశారు.ఆ సమయంలో వాడిన కారు, సెల్‌ఫోన్‌తోపాటు విచారణకు హాజరు కావాలన్నారు. దాంతో కొంత సమయం కావాలని పోలీసులను కోరారు. అనంతరం హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు శుక్రవారం మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తన న్యాయవాదులతో కలిసి విచారణకు జోగి హాజరయ్యారు. జోగితోపాటు ఆయన వాడిన సెల్‌ఫోన్‌, కారును పోలీసులకు చూపించారు. అనంతరం ఆయన జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ, తనను మళ్లీ విచారణకు రావాలని పోలీసులు కోరలేదన్నారు. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని, ఖచ్చితంగా అడిగిన అన్నింటా సమాధానం చెబుతానని వెల్లడిరచారు. ఎన్నికల్లో సూపర్‌ 6కు ఆశపడి ప్రజలు ఆయనను గెలిపించారని, వాటిని అమలు చేయకుండా మాపై ఇలా కక్ష పూరితంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరే ప్రసక్తి లేదన్నారు. తన కుమారుడును అగ్రిగోల్డ్‌ భూ లావాదేవీల కేసులో అన్యాయంగా ఇరికించారని జోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. (Story: ఎట్టకేలకు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు జోగి రమేష్‌)

See Also…

నేను విదేశాలకు వెళ్లలేదు..!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version