Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నేను విదేశాలకు వెళ్లలేదు..!

నేను విదేశాలకు వెళ్లలేదు..!

0

నేను విదేశాలకు వెళ్లలేదు..!

వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌

న్యూస్ తెలుగు/అమరావతి: నేను విదేశాలకు వెళ్లిపోతున్నానంటూ నాపై సామాజిక మాద్యమాల్లో వచ్చిన ప్రచారం అంతా అవాస్తవమని వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ ఖడిరచారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి ఘటన కేసులో అవినాష్‌తోపాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. దీనిపై పోలీసులు అవినాష్‌కు లుక్‌అవుట్‌ నోటీసులు జారీజేశారు. దానిపై ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ క్రమంలో అవినాష్‌ హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు వెళ్లిపోతుండగా, అక్కడ మంగళగిరి పోలీసుల సమాచారంతో ఆయనను అడ్డుకోగా, అవినాష్‌ వెనక్కి వచ్చినట్లు ప్రచారం వచ్చింది. దీనిపై అవినాష్‌ స్పందిస్తూ తాను ఎక్కడికీ వెళ్లిపోవాల్సిన అవసరం లేదని వివరణిచ్చారు. అనునిత్యం విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఇలాంటి తప్పుడు కేసులకు భయపడి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. తనపై వచ్చిన కేసులను న్యాయస్థానం ఇచ్చే తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. (Story: నేను విదేశాలకు వెళ్లలేదు..!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version